Site icon HashtagU Telugu

Geetham University : గీతం యూనివ‌ర్సిటీ ద‌గ్గ‌ర మ‌రోసారి ఉద్రిక్త‌త‌.. అర్థ‌రాత్రి జేసీబీల‌తో వెళ్లిన అధికారులు

Geetham University

Gitam

విశాఖప‌ట్నం గీతం యూనివ‌ర్సిటీ ద‌గ్గ‌ర మరోసారి ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అర్థ‌రాత్రి జేసీబీల‌తో అధికారులు యూనివ‌ర్సిటీ ప్రాంగ‌ణంలోకి చేరుకున్నారు. యూనివ‌ర్సిటీకి వెళ్లే అన్ని మార్గాల‌ను పోలీసులు మూసివేశారు. అర్థరాత్రి నుంచి ఎండాడ, రుషి కొండ మార్గాల్లో ఆక్రమణల తొలగింపు కోసం రెవెన్యూ అధికారులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గీతం యూనివర్శిటీ పరిసరాల్లోని దాదాపు 5 ఎకరాల భూముల్లో అక్రమణలను తొలగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అక్కడ రోడ్లపై బారికేడ్లు పెట్టారు. రోడ్లు మూసివేయ‌డంపై వాహ‌న‌దారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మార్కింగ్ చేసిన ప్రాంతాల్లో కంచెతో పాఉట‌.. గోడ‌లు కూల్చేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇటు గీతం యూనివ‌ర్సిటీలో గోడ‌లు కూల్చ‌డాన్ని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా జగన్ విధ్వంసాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని.. గీతం యూనివర్సిటీ గోడలు కూల్చడం దుర్మార్గపు చర్య అని ఆయ‌న అన్నారు. కోడి కత్తి డ్రామాని న్యాయస్థానాలు బట్టబయలు చేయడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ విధ్వంసానికి పూనుకున్నార‌ని అచ్చెన్నాయుడు ఆరోపించారు. చదువుల తల్లి గీతం యూనివర్సిటీ పై జగన్ మోమ‌న్ రెడ్డికి అంత కక్ష్య ఎందుకు ? అని అచ్చెన్నాయుడు ప్ర‌శ్నించారు. టీడీపీ నేతల ఆస్తులు కూల్చడం, అక్రమ కేసులు పెట్టడం జగన్ మోహ‌న్‌ రెడ్డికి వ్యసనంగా మారిపోయిందని.. నియంతలు,నికృష్టులు పాలకులైతే పరిపాలన ఇలానే ఉంటుందన్నారు. జగన్ ప్రభుత్వంలో నిర్భంధం,అణచివేతలు, వేధింపులు,రౌడీయిజం తారాస్థాయికి చేరిందని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక జగన్ కి, వైసీపీ నేతలకు పరివర్తన పాఠాలు నేర్పిస్తామ‌న్నారు.