TDP : ప‌లాస‌లో ఉద్రిక్త‌త‌.. టీడీపీ నేత‌లు గౌతు శిరీష‌, ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు అరెస్ట్‌

శ్రీకాకుళం జిల్లా పలసా నియోజ‌క‌వ‌ర్గంలో ఉద్రిక్త‌త చోటుచేస‌కుంది. కాశీబుగ్గ మున్సిపాలిటిలో టీడీపీ నేత నాగరాజు ఇంటి

  • Written By:
  • Updated On - July 2, 2023 / 05:25 PM IST

శ్రీకాకుళం జిల్లా పలసా నియోజ‌క‌వ‌ర్గంలో ఉద్రిక్త‌త చోటుచేస‌కుంది. కాశీబుగ్గ మున్సిపాలిటిలో టీడీపీ నేత నాగరాజు ఇంటి ముందు ఉన్న కల్వర్టు కూల్చివేయడాన్ని టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు, ప‌లాస ఇంఛార్జ్ గౌతు శిరీష్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌లు ఆందోళ‌న నిర్వ‌హించారు అయితే వీరిని పోలీసులు అక్ర‌మంగా అరెస్ట్ చేశారు. టీడీపీ నేత‌ల అక్ర‌మ అరెస్ట్‌ల‌ను రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. నియంతలు, నికృష్టులు పాలకులు అయితే పరిపాలన ఇలానే ఉంటుందని ఆయ‌న ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వంలో నిర్భంధం, అణచివేతలు, వేధింపులు, రౌడీయిజం తారాస్థాయికి చేరిందని.. జగన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నాకది-నీకిది పద్దతిలో నిర్మించిన హైదారాబాద్, బెంగుళూరు, ఇడుపుల పాయలలో నిర్మించిన రాజప్రసాదాలకు ఏం సమాధానం చెబుతారని ఆయ‌న ప్ర‌శ్నించారు.వైసీపీ నేతలు రోజు రోజుకీ హద్దు మీరి రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని.. మంత్రి సీదిరి అప్పలరాజు అక్రమాలను నిరంతరం ఎండగడుతున్నందుకే నియోజకవర్గంలో టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అచ్చెన్న ఆరోపించారు. ఇల్లు కూల్చి వేసిన భాధితులను పరామర్శించాలని పలాసకు భయలుదేరిన టీడీపీ నేతలను వందల మందిని పోలీసులను మోహరించి అనుమతి లేదని అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. జగన్ రెడ్డి ప్రతిపక్ష నేత ఇంటిని టార్గెట్ చేస్తే.. గ్రామ స్ధాయిలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తల ఇళ్లను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని.. పాలించమని ప్రభుత్వానికి అధికారమిస్తే ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలపైనే ప్రభుత్వ పెద్దలు దృష్టిసారించడం దుర్మార్గమ‌న్నారు. కూల్చివేతలతో మొదలైన వైసీపీ ప్రభుత్వం.. వచ్చే ఎన్నికల్లో ప్రజాతీర్పుతో కూలడం ఖాయమ‌ని.. అక్రమంగా అరెస్ట్ చేసిన టీడీపీ నేతలు రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష, నాగరాజు, బెందాలం అశోక్‍, టీడీపీ నేతలు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.