Site icon HashtagU Telugu

Somu Veerraju Video: పోలీసుల‌పై బీజేపీ చీఫ్ బాహాబాహీ!

Somu Veerraju

Somu Veerraju

ఏపీ పోలీసుల మీద బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు రెచ్చిపోయారు. చొక్క‌ప‌ట్టుకుని స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్ ను నెట్టేశారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న మీద పోలీసు కేసు న‌మోదు చేయ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ సాహ‌సం చేయ‌లేక‌పోతోంది. అందుకు సంబంధించిన వివ‌రాల్లోకి వెళితే, అమలాపురం అల్లర్ల మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ వద్ద కు వెళ్లారు. అక్క‌డ‌ పోలీసులు అడ్డుకోవడంతో సోము వీర్రాజు కారులో నుంచి దిగి పోలీసుల‌ను దుర్భాష‌లాడారు. విధుల్లో ఉన్న పోలీసుల‌పై చేయిచేసుకున్నారు. బాహాబాహికి దిగారు. సెక్ష‌న్‌ 30 అమలులో ఉన్నందున అమలాపురం పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో సోము వీర్రాజును జొన్నాడ వద్ద అరగంట పాటు నిలిపివేశారు. వీర్రాజును ముందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు మరో వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

వాహనాన్ని ఆపడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి జిల్లా ఎస్పీతో మాట్లాడి అనుమతి ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత రావులపాలెం వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంతో అమలాపురంలో హింస చెలరేగడంతో పోలీసులు అక్కడ 144 సెక్షన్, 30 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే. అల్లర్లకు సంబంధించి దాదాపు 100 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అమలాపురంలో మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే.

https://youtu.be/6oS_s7jmcA8

Exit mobile version