CM Jagan : ఏపీలో పోలింగ్ ముగియడంతో సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనకు వెళ్లారు. ఆయన విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లారు. అయితే, సీఎం జగన్ లండన్‌కు వెళ్లే సమయంలో ఎయిర్ పోర్ట్‌లో అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపైనే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఇంతకీ అతడు ఎవరు అనే దానిపై డిస్కషన్ నడుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తిని అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన డాక్టర్ తుళ్లూరు లోకేష్‌గా గుర్తించారు. అతడికి అమెరికా పౌరసత్వం కూడా ఉందనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. సీఎం వైఎస్ జగన్ (CM Jagan) విదేశీ పర్యటనకు సంబంధించిన కొన్ని మెసేజ్‌లను పలువురికి లోకేష్ పంపినట్లు గుర్తించారు. సీఎం జగన్ వెళ్లే సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో లోకేష్ కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించే క్రమంలో పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో.. తనకు గుండె పోటు వచ్చిందని లోకేష్ చెప్పడంతో ఆస్పత్రిలో చేర్చారు. సీఎం జగన్ విదేశీ పర్యటనకు తుళ్లూరు లోకేష్‌కు సంబంధం ఏమిటి ? ఆ సమయంలో ఎందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు ? లోకేష్.. సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన మెసేజ్‌లను ఎవరికి పెట్టాడు ? తదితర వివరాలను తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.
Also Read :City Buses : ఆర్టీసీ మెగాప్లాన్.. మెట్రో లేని రూట్లలో 10 నిమిషాలకో బస్సు
లండన్ పర్యటనకు వెళ్తుండగా సీఎం వైఎస్ జగన్‌కు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు తదితరులు సెండాఫ్ ఇచ్చారు. ఈ నెల 31న వైఎస్ జగన్ బెజవాడకు తిరిగి చేరుకోనున్నారు.