Site icon HashtagU Telugu

AP Elections : తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న టీడీపీ, వైసీపీ వర్గాలు

Tpt Rdo Office

Tpt Rdo Office

నామినేషన్ల (Nominations) చివరి రోజున (Last Day) పలు చోట్ల ఉద్రిక్తత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో అధికార -ప్రతిపక్ష పార్టీల (TDP-YCP) కార్యకర్తల మధ్య దాడుల పర్వం కొనసాగుతుంది. ఈరోజు తిరుపతి ఆర్డీవో కార్యాలయం (Tirupati RDO Office) వద్ద అలాంటి ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రగిరి టీడీపీ, వైసీపీ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తలు ఒకేసారి రావడంతో ఘర్షణ జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు విసురుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

ముందుగా పోలీసులు వైసీపీ అభ్యర్థి వాహనాన్ని కార్యాలయంలోకి అనుమతించడంతో టీడీపీ శ్రేణులు బారికేడ్లను తోసుకుని ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు కార్యకర్తల మధ్య పోటాపోటీ నినాదాలు కాస్త..ఒకరిపై ఒకరు దూషించుకునే స్థాయి వరకు వెళ్ళింది. ఆ తర్వాత ఇరువురు రాళ్ల దాడి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అక్కడినుండి చెదరగొట్టారు. దీంతో కాస్త గొడవ సద్దుమణిగింది.

ఇక ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్​లు వేసేందుకు ఈరోజు ఆఖరి రోజు కావడంతో నేతలంతా భారీగా ర్యాలీగా వెళ్లి నామినేషన్​ దాఖలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు సందడి వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. కూటమి అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమం చాలా ప్రాంతాల్లో అట్టహాసంగా కొనసాగుతోంది. టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున తన నేతలకు అభివాదం తెలుపుతూ..ర్యాలీలో పాల్గొంటున్నారు.

Read Also : Sam Pitroda : శ్యాం పిట్రోడా ఎవరు ? ‘వారసత్వ పన్ను’పై వ్యాఖ్యలతో రాజకీయ దుమారం

Exit mobile version