మోహన్ బాబు ( Mohan Babu) కుటుంబంలోని అంతర్గత వివాదాలు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి. తాజాగా యూనివర్శిటీ (University) వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మంచు మనోజ్ (Manchu Manoj) తన తాత, నానమ్మ సమాధులను దర్శించుకోవడానికి యూనివర్శిటీకి వెళ్ళేందుకు యత్నించగా, కోర్టు ఆదేశాల ప్రకారం లోపలకు అనుమతి లేదని పోలీసులు అడ్డగించారు.
మనోజ్ తన తాత, నానమ్మ సమాధులను చూసేందుకు ఎవరైనా అనుమతి ఇవ్వాలా అంటూ ప్రశ్నించారు. తాను ఎలాంటి గొడవ చేయనని, సమాధులకు దండం పెట్టుకుని బయటకు వచ్చేస్తానని స్పష్టం చేశారు. అయితే మోహన్ బాబు క్యాంప్ నుండి ఆదేశాల ప్రకారం యూనివర్శిటీ ప్రాంగణంలోకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటనతో ఇరు వర్గాల బౌన్సర్లు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. గొడవ తీవ్ర రూపం దాల్చడంతో రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనతో అక్కడ వాతావరణం కాసేపు ఉద్రిక్తంగా మారింది.
తనకు గొడవ చేయడం ఉద్దేశం కాదని, అనవసరంగా ఈ వివాదం ఎందుకు అంటూ మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు ఉద్రిక్తతలను అదుపులోకి తీసుకుని, మనోజ్ దంపతులను యూనివర్శిటీ లోపలికి అనుమతించారు. దంపతులు సమాధులకు దండం పెట్టుకుని, తలవంచి నమస్కరించిన అనంతరం యూనివర్శిటీ ప్రాంగణాన్ని వీడారు. ఈ ఘటన మరోసారి మోహన్ బాబు కుటుంబంలో ఉన్న విభేదాలను వెలుగులోకి తెచ్చింది.
Read Also : Kanuma Offer : ఇంటింటికీ ఫ్రీగా మటన్..ఎక్కడంటే ..!!