నందమూరి బాలకృష్ణ (Balakrishna) హిందూపురం పర్యటన (Hindupuram Tour)లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాదాపు 10 నెలల తర్వాత హిందూపురంలో అడుగుపెట్టారు బాలయ్య. గత కొద్దీ నెలలుగా నియోజకవర్గ ప్రజలు బాలకృష్ణ ఫై ఆగ్రహం తో ఉన్నారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని , అభివృద్ధి ఫై దృష్టి పెట్టడం లేదని వాపోతున్నారు. ఇదే విషయాన్నీ టీడీపీ క్యాడర్ బాలకృష్ణ దృష్టి కి తీసుకెళ్లడం తో..నియోజకవర్గంలో పర్యటనకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు హిందూపురం టీడీపీ మండల కన్వీనర్ అశ్వత్ రెడ్డి కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు బాలకృష్ణ హాజరు అయ్యారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా వైసీపీ (YCP) పార్టీకి చెందిన మధు అనే కార్యకర్త బాలకృష్ణ కారును అడ్డుకొని , తన చేతిలో ఉన్న ప్లకార్డుతో హడావిడి చేసాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మధును అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్లకార్డుకు ఉన్న కర్ర ఎస్సైకి తగిలింది. మధును పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా… అతను అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత బాలకృష్ణ అక్కడి నుండి వెళ్లిపోయాడు.
Read Also : CPM : సీపీఎం ప్రజా రక్షణ భేరి సభ.. 31 డిమాండ్లతో ప్రజా మేనిఫెస్టో రిలీజ్