Site icon HashtagU Telugu

Tender for priests : జ‌గ‌న్ జ‌మానాలో అర్చ‌కుల బ‌హిరంగ వేలం, అన్న‌వ‌రం సాక్షిగా బ‌రితెగింపు

Tender For Priests

Tender For Priests

హిందూధ‌ర్మాన్ని, స‌నాత‌న ధ‌ర్మాల‌ను వేలం (Tender for priests)వేయ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ సిద్ద‌మ‌యింది. అన్న‌వ‌రం స‌త్యనారాయ‌ణ‌స్వామి సాక్షిగా అందుకు బీజం పడింది. ఇదే విష‌యాన్ని జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వారాహి యాత్ర‌లో ప్ర‌శ్నించారు. వేలం వేయ‌డానికి `నువ్వు ఎవ‌డివి..` అంటూ ఘాటుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని నిల‌దీశారు. మునుపెన్న‌డూ లేని విధంగా పురోహితుల‌ను కాంట్రాక్ట‌ర్లు కేటాయించే ప‌ద్ధ‌తికి నాంది ప‌లికారు. అందుకు సంబంధించిన టెండ‌ర్ ను వేలం వేయ‌డం గ‌మ‌నార్హం.

హిందూధ‌ర్మాన్ని, స‌నాత‌న ధ‌ర్మాల‌ను వేలం (Tender for priests)

అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయ ట్ర‌స్ట్ బోర్డు తీసుకున్న (Tender for priests)  నిర్ణ‌యం వివాద‌స్ప‌దం అయింది. బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని అర్చకులు, హిందూభ‌క్తులు వ్యతిరేకించారు. ఆలయ ప్రాంగణంలోని రత్నగిరి కొండల వద్ద ఉప‌న‌య‌నాలు, వివాహాలు చేయడానికి రూ. 5,000 రుసుమును బోర్డు నిర్ణయించింది. ఆ మేర‌కు ప్రైవేటుకు కాంట్రాక్టు ఇవ్వ‌డానికి సాహ‌సం చేసింది. టెండ‌ర్ ద‌క్కించుకున్న కాంట్రాక్ట‌ర్ కింద పూజారులు ప‌నిచేయాల‌న్న నిబంధ‌న పెట్టింది. గ‌తానికి భిన్నంగా పెళ్లి చేసుకున్న వాళ్లు ప్రైవేటు కాంట్రాక్ట‌ర్ కు రుసుం చెల్లించేలా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను వెల్ల‌డించారు. ఆలయంలో పూజలు చేయాలనుకునే భ‌క్తుల నుండి అర్చకులు గణనీయమైన మొత్తాలను పొందుతున్నారు. అందుకే, వాళ్ల నుంచి త‌ప్పిస్తూ కాంట్రాక్ట‌ర్ల‌ను ప్ర‌వేశ పెట్టాల‌ని బోర్డు తీర్మానించింది.

పురోహితులు కాని కొందరు బ్రాహ్మణులు పురోహితులుగా వ్యవహరిస్తూ

అర్చకుల సంఘాలు, బ్రాహ్మణ సంఘం, ఇతర ఆలయ సిబ్బంది నిరసనకు దిగ‌డంతో ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్‌ ఆజాద్‌కు వేలం ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిని మానుకుని వ్యవస్థను క్రమబద్ధీకరించాలని సూచించారు. పురోహితులు కాని కొందరు బ్రాహ్మణులు పురోహితులుగా వ్యవహరిస్తూ వివాహాలు చేస్తున్నార‌ని ఈవో అంటున్నారు. ఇటీవల ఓ క్రైస్తవుడు గుడిలో పెళ్లి చేసుకుంటూ కనిపించాడు. ఆలయంలో మధ్యవర్తుల ప్రభావంతో పురోహిత్‌గా వ్యవహరించారని ఈఓ పేర్కొన్నారు. ఇలాంటి దందాల‌కు టెండ‌ర్ ప‌ల‌వ‌డం (Tender for priests) ద్వారా స్వ‌స్తి ప‌ల‌కొచ్చ‌ని ఈవో అభిప్రాయ‌ప‌డ‌డం గ‌మ‌నార్హం.

పురోహితుల వేలం పేరుతో మరో దందాకు తెరతీశారని

ఆలయానికి రూ.5 వేల రుసుమును రద్దు చేయాలని సంఘం నాయకులు ఈఓకు విన్నవించారు. ఫీజులను రూ.1500కు తగ్గించేందుకు ఈఓ అంగీకరించారు. ఈఓ ఫీజు తగ్గింపు ప్రతిపాదనను తాము అంగీకరించడం లేదని ఆంధ్రప్రదేశ్ పురోహిత్ బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు చెప్పారు. “దేవస్థానం ఫీజులను మరియు కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేయాలి. ప్రస్తుతం వివాహ పార్టీల నుండి రూ. 250 రుసుము తీసుకుంటున్నందున మధ్యవర్తులను  (Tender for priests)తొలగించడం ఆలయ ట్రస్ట్ బోర్డుపై ఉందని గుర్తు చేస్తున్నారు. ఆలయంలో కళ్యాణం నిర్వహించాలనుకునే వారిలో చాలా మంది మధ్యతరగతి వర్గాల వెనుకబడిన వారు లేదా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారేనని ఆయన అన్నారు. ఆలయానికి రుసుముగా రూ.1.500 కూడా చెల్లించడం వారికి కష్టంగా ఉంది.

కాంట్రాక్ట‌ర్ కింద పూజారులు ప‌నిచేయాల‌న్న నిబంధ‌న

అపన్న ప్రదీపన్ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యప్ప శర్మ మాట్లాడుతూ అనేక వివాహాలకు సొంత పురోహితులు ఉన్నారని, ఆలయ అధికారులు వారికి ఎలాంటి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.
ఈఓ అనేక అవకతవకలకు పాల్పడ్డారని, ఇప్పుడు పురోహితుల వేలం పేరుతో మరో దందాకు తెరతీశారని ఆరోపించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు నిర్ణయం అంటే వేదాలను వేలం  (Tender for priests)వేయడమేనని, దీన్ని ఇక్కడితో ఆపకపోతే ఈ వైరస్ ఇతర దేవాలయాలకు కూడా వ్యాపిస్తుంది’ అని బ్రాహ్మణ సంఘాలు వాపోతున్నాయి. భోగి గణపతి పీఠం వ్యవస్థాపకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ ఆలయ అధికారుల తీరును ప్రభుత్వం అడ్డుకోవాలని కోరారు. భక్తులు కోరుకున్న విధంగా వివాహాలు చేయడం అర్చకులకు కష్టంగా మారుతుంది.

దేవాల‌యాల మీద వివ‌క్ష‌ను చూపిస్తున్నార‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద  ఆరోప‌ణ‌లు

రత్నగిరి కొండలకు ఇతర ప్రాంతాల నుంచి భోజనాలు తీసుకురావడానికి ఇప్పటికే ఆలయ అధికారులు అనుమతించడం లేదని, ఇప్పుడు వివాహాల నిర్వహణలో పురోహిత్‌పై ఆంక్షలు విధించారని ఆయన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి లేఖ రాశారు. అన్నవరం పురోహిత్ సంఘం ప్రధాన కార్యదర్శి రవిశర్మ మాట్లాడుతూ బ్రాహ్మణేతరులకు పురోహిత్ కాంట్రాక్టర్ల వేలం టెండర్ల.(Tender for priests) అంశాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వివాహాలకు అర్చకులను కేటాయించేందుకు బ్రాహ్మణ కాంట్రాక్టర్‌కే టెండర్‌ వస్తుందని, పురోహితులకు దేవస్థానం నిర్ణయించిన విధంగా రుసుము నిర్ణయిస్తామని ఈఓ వారికి హామీ ఇచ్చారు.

చ‌ర్చి, ఫాద‌ర్లు, ఇమాంల‌కు గౌర‌వ వేతనాన్ని

పురోహితులను ఎంపిక చేయడం, సంగీతం, అలంకరణ, భోజనాలు మొదలైన వాటితో మధ్యవర్తులు వివాహ పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకుని దోచుకుంటున్నారని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ మీడియాకు తెలిపారు. ఆలయ అధికారులు దీనిని అరికట్టాలన్నారు. అన్న‌వ‌రం కేంద్రంగా మొద‌లైయిన ప్రైవేటు కాంట్రాక్ట‌ర్ల‌కు పూజారుల‌ను అప్ప‌గించ‌డం రాజ‌కీయాన్ని సంత‌రించుకుంది. జ‌న‌సేనా చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న యాత్ర‌లో (Tender for priests) ఇదే అంశాన్ని ప్ర‌ధానంగా వినిపిస్తున్నారు.

Also Read : Jagan Delhi Tour: జగన్ ముందస్తు ముచ్చట.. మోడీ గ్రీన్ సిగ్నల్!

క్రిస్ట‌య‌న్ గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఆ మ‌త‌స్తులు గుర్తిస్తుంటారు. చ‌ర్చి ఫాద‌ర్ లు సైతం 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అనుకూలంగా ప‌నిచేశారు. వాళ్లంద‌రినీ స‌మ‌న్వ‌యం చేసే బాధ్య‌త‌ల‌ను అప్ప‌ట్లో బ్ర‌ద‌ర్ అనిల్ తీసుకున్నారు. అధికారం వ‌చ్చిన త‌రువాత హిందూ దేవాల‌యాల మీద వివ‌క్ష‌ను చూపిస్తున్నార‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద వ‌చ్చిన ఆరోప‌ణ‌లు అనేకం. ప్ర‌పంచ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోన్న తిరుమ‌ల శ్రీ వెంక‌టేశ్వ‌రుని స‌న్నిధిలో జ‌రిగిన అక్ర‌మాల‌ను ఎప్ప‌టికప్పుడు భ‌క్తులు బ‌య‌ట‌పెడుతున్నారు. తిరుమ‌ల వెళ్లే బస్సుల టిక్కెట్ల వెనుక జెరూస‌లెం యాత్ర ప్ర‌చారం గురించి ముద్రించిన అంశం దుమారం రేపింది. హిందూయేత‌రులు ఉద్యోగులుగా శ్రీవారి స‌న్నిధిలో ఉన్నారు. కొంద‌రు అన్య మ‌త ప్ర‌చారం చేస్తూ త‌ర‌చూ ప‌ట్టుబ‌డుతున్నారు.

Also Read : Janasena fever : డిప్ర‌ష‌న్లో ప‌వ‌న్ ? సోష‌ల్ మీడియాలో YCP దుమారం!!

గ‌త నాలుగేళ్లుగా హిందూ దేవాల‌యాల్లోని దేవ‌తామూర్తుల విగ్ర‌హాల ధ్వ‌సం, రథాల‌ను త‌గుల‌బెట్టిన సంఘ‌ట‌న‌లు అనేకం చోటుచేసుకున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దుర్ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డిన వాళ్ల‌పై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోలేక‌పోయింద‌ని హిందూ భ‌క్తులు చేసే ఆరోప‌ణ‌. అంతేకాదు, పంచాయ‌తీరాజ్ నిధుల నుంచి ప్ర‌తి గ్రామానికి చ‌ర్చిలను నిర్మించ‌డానికి 1000కోట్ల‌ను ఇటీవ‌ల జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ కేటాయించింది. ఇక ముస్లింల ప్రార్థ‌నా మందిరాల కోసం నిధులు కేటాయించారు. హిందూ దేవాల‌యాల్లోని అర్చ‌కుల‌ను ప‌ట్టించుకోని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం చ‌ర్చి, ఫాద‌ర్లు, ఇమాంల‌కు గౌర‌వ వేతనాన్ని ఇస్తున్నారు. ఇదంతా అన్య‌మ‌త‌స్తుల‌ను ప్రోత్స‌హించ‌డానికి ప్ర‌భుత్వం చేస్తోన్న కార్య‌క్ర‌మం కింద హిందూ మ‌ఠాధిప‌తులు, పీఠాధిప‌తులు భావిస్తున్నారు. కేంద్రానికి కూడా ఏపీలోని ప‌రిస్థితుల‌పై స్వామీజీలు అనేక మంది ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. అయిన‌ప్ప‌టికీ అన్న‌వ‌రం కేంద్రంగా పురుహితుల‌ను వేలం వేయ‌డానికి సాహ‌సం చేసిన జ‌గ‌న్ స‌ర్కార్ ప‌లు విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది.