Telugu – US: గుడ్ న్యూస్.. అమెరికాలో తెలుగుభాషకు 11వ ర్యాంక్

మన తెలుగు భాష అమెరికాలోనూ దూసుకుపోతోంది. అత్యంత జనాదరణను సొంతం చేసుకుంటోంది.

  • Written By:
  • Publish Date - June 27, 2024 / 12:32 PM IST

Telugu – US: మన తెలుగు భాష అమెరికాలోనూ దూసుకుపోతోంది. అత్యంత జనాదరణను సొంతం చేసుకుంటోంది. అమెరికాలో అత్యధికంగా ప్రజలు మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో ఉంది. అమెరికాలో అత్యధికులు మాట్లాడే భారతీయ భాషల్లో నంబర్ 1 స్థానంలో హిందీ, నంబర్ 2 స్థానంలో గుజరాతీ ఉన్నాయి. నంబర్ 3 స్థానంలో మన తెలుగు ఉంది. అమెరికా సెన్సస్ బ్యూరో డేటా ఆధారంగా తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈవివరాలను వెల్లడించారు. మన దేశం నుంచి అమెరికాకు వలస వెళ్తున్న కొత్తతరం యువతలో ఎక్కువ మంది తెలుగులో మాట్లాడేందుకే ప్రయారిటీ ఇస్తున్నారని నివేదిక తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join

అమెరికాలో తెలుగుతేజాలు

  • అమెరికాలో(Telugu – US) తెలుగు మాట్లాడే వారి సంఖ్య 2016 సంవత్సరంలో 3.2 లక్షలు ఉండగా.. 2024 సంవత్సరం నాటికి ఆ సంఖ్య 12.3 లక్షలకు చేరుకుంది. అంటే తెలుగు మాట్లాడే వారి సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగిందన్న మాట.
  • అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యధికంగా 2 లక్షల మంది తెలుగు మాట్లాడుతారు.
  • టెక్సాస్ రాష్ట్రంలో 1.5 లక్షల మంది, న్యూజెర్సీ రాష్ట్రంలో  1.1 లక్షల మంది, ఇల్లినాయిస్ రాష్ట్రంలో 83 వేల మంది, జార్జియా రాష్ట్రంలో  52వేల మంది, వర్జీనియా రాష్ట్రంలో 78వేల మంది తెలుగు మాట్లాడుతారని నివేదిక వివరించింది.
  • ఆయా అమెరికా రాష్ట్రాల్లోని తెలుగు సంఘాలు కూడా ఈ అంచనాలతో ఏకీభవిస్తున్నాయి.
  • అమెరికాలో 350 విదేశీ భాషలు వినియోగంలో ఉన్నాయి. అయితే వాటిలో 11వ స్థానంలో తెలుగు ఉండటం విశేషం.
  • ప్రతి సంవత్సరం దాదాపు 70వేల మంది తెలుగు విద్యార్థులు,  10,000 మంది H1b వీసా కలిగిన తెలుగువారు అమెరికాకు వెళ్తున్నారు.
  • అమెరికాకు వెళ్తున్న తెలుగువారిలో దాదాపు 75 శాతం మంది డల్లాస్, బే ఏరియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా మరియు నాష్‌విల్లే వంటి ప్రదేశాలలో స్థిరపడుతున్నారు.
  • ప్రస్తుతం అమెరికాకు వెళ్తున్న తెలుగు యువతలో 80 శాతం మంది ఐటీ, ఫైనాన్స్‌ రంగాల్లో పనిచేస్తున్నారు.