Telugu Film :టాలీవుడ్ లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చిచ్చు! చిరు, బాల‌య్య సినిమాల‌ వార్‌!

ఏపీ ప్ర‌భుత్వం టాలీవుడ్ హీరోలు చిరంజీవి, బాల‌క్రిష్ణ సినిమాల(Telugu Film) విష‌యంలో విభిన్నంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ స్పందించింది.

  • Written By:
  • Updated On - January 11, 2023 / 12:39 PM IST

ఏదైనా విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం ఒకేలా ఉండాలి. అంద‌రికీ ఒకే విధంగా దాన్ని అమ‌లు చేయాలి. కానీ, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మాత్రం `నా పాల‌న నా ఇష్టం` అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. టాలీవుడ్ హీరోలు చిరంజీవి, బాల‌క్రిష్ణ సినిమాల(Telugu Film) విష‌యంలో విభిన్నంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ స్పందించింది. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన వార్తేరు వీర‌య్య సినిమాకు రూ. 25లు పెంపుకు ఏపీ ప్ర‌భుత్వం అనుతించింది. అదే, బాలక్రిష్ణ న‌టించిన వీర‌సింహారెడ్డి సినిమాకు రూ. 20లు పెంపుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇలాంటి భిన్న‌మైన నిర్ణ‌యం వెనుక ఉన్న శాస్త్రీయ వాద‌న ఏమిటో అర్థం కావ‌డంలేదు.

కొత్త సినిమాలు(Telugu Film) విడుద‌ల

సాధార‌ణంగా కొత్త సినిమాలు(Telugu Film) విడుద‌ల సంద‌ర్భంగా బెనిఫిట్ షోలు, టిక్కెట్ల(Tickets) పెంపు మీద ఇటీవ‌ల ప్ర‌భుత్వాలు నిర్ణ‌యం తీసుకుంటున్నాయి. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా టిక్కెట్ల ధ‌ర‌ల పెంపుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రుగుతోంది. టిక్కెట్ ఆన్ లైన్ విధానం, టిక్కెట్ ధ‌ర‌ల నియంత్ర‌ణ చేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల‌పై ఉంది. అందుకు భిన్నంగా ప్రేక్ష‌కుల్లో ఉండే ఉత్సాహాన్ని దోచుకోవ‌డానికి ప్ర‌భుత్వం అనుమ‌తిస్తోంది. బెనిఫిట్ షోల‌కు అనుమ‌తుల‌ను ఇస్తోంది. ఇవ‌న్నీ ఒక్కో హీరోకు ఒక్కోలా ఏపీ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకోవ‌డం ఇటీవ‌ల వివాద‌స్ప‌దం అవుతోంది.

Also Read : Shruti Haasan Interview: చిరు, బాలయ్య లాంటి లెజెండ్స్ తో కలసి నటించడం నా అదృష్టం: శృతిహాసన్

ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత టాలీవుడ్ కు చెందిన ప‌లు అంశాల‌పై వివాదం నెల‌కొంది. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన బీమ్లానాయ‌క్ సినిమాకు బెనిఫిట్ షోలు, టిక్కెట ధ‌ర‌ల పెంపుకు నిరాక‌రించింది. ఆ సంద‌ర్భంగా టాలీవుడ్ లోని ప‌లువురు హీరోలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌ద్ద‌కు వెళ్లి క్యూ క‌ట్టారు. భ‌విష్య‌త్ లో టిక్కెట్ల(Tickets) ధ‌ర‌ల పెంపు, బెనిఫిట్ షోల విష‌యంలో ద‌య‌త‌ల్చాల‌ని అభ్యర్థించారు. టాలీవుడ్ టాప్ హీరోలు దాదాపుగా అంద‌రూ తాడేప‌ల్లి క్యాంప్ ఆఫీస్ వ‌ద్ద మోకారిల్లారు. అక్క‌డికి వెళ్ల‌కుండా ఉన్న హీరోల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్, బాల‌క్రిష్ణ మాత్ర‌మే ఉన్నారు. మిగిలిన వాళ్లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దయాదాక్షిణ్యాల కోసం ప‌లు ప్ర‌య‌త్నాలు చేశారు.

 టిక్కెట్ల(Tickets) ధ‌ర‌ల పెంపు

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ సినిమాను బ‌తికించ‌డ‌ని చేతులు జోడించి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని వేడుకున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన జ‌న‌సేనాని మ‌న‌స్తాపం చెందారు. `ఇగో` వ్య‌వ‌హారం తెర మీద‌కు ఆనాడు బాగా వ‌చ్చింది. ఆ త‌రువాత జ‌రిగిన. రాజ‌కీయ ప‌రిణామాల‌న్నీ మ‌నం చూశాం. సీన్ క‌ట్ చేస్తే, ఇప్పుడు వాల్తేరు వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి సినిమాల విడుద‌లపై ఏపీ స‌ర్కార్ భిన్నంగా నిర్ణ‌యాన్ని తీసుకుంది. దీంతో మెగా అభిమానులు ఆనందంగా ఉండ‌గా, నంద‌మూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు. టాలీవుడ్ పెద్ద‌గా చిరంజీవిని చిత్రీక‌రిస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ గేమ్ ఆడుతున్నార‌ని ఆరోపిస్తున్నారు. గ‌తంలోనూ టాలీవుడ్ పెద్ద‌గా చిరంజీవిని ఏపీ సీఎం తాడేప‌ల్లికి పిలిపించుకున్నారు. ఇప్పుడు కూడా వాల్తేరు వీర‌య్య సినిమాకు టిక్కెట్ ధ‌ర‌ల‌ను రూ. 25లు పెంచుకునేలా నిర్ణ‌యం తీసుకోవ‌డం చిరంజీవికి పెద్ద పీఠ వేయ‌డ‌మే. ఇదే విష‌యాన్ని బాల‌య్య అభిమానులు గుర్తు చేస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాల‌కాన్ని త‌ప్పుబ‌డుతున్నారు.

Also Read : SS Thaman Exclusive: ‘వీరసింహారెడ్డి’ కల్ట్ మూవీ.. స్పీకర్లు పగిలిపోతాయి: ఎస్ ఎస్ థమన్!