తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు(CBN) సామాజిక న్యాయాన్ని(Social engineering) పాటిస్తుంటారు. సొంత సామాజిక వర్గాన్ని నెత్తిన పెట్టుకోరు. ఆయన చుట్టూ నలుగురు ఉండే వాళ్ల సామాజికవర్గాన్ని(Social wing) గమనించి మెలుగుతారు. అందుకే, సొంత సామాజికవర్గం(social engineering) నేతలు చాలా సందర్భాల్లో నష్టపోయారు. ఆ విషయాన్ని టీడీపీ సీనియర్లను ఎవర్ని కదిలించినా చెబుతారు. ఇటీవల చంద్రబాబు (CBN) కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన `ఇదేం ఖర్మ..మన రాష్ట్రానికి` బహిరంగ సభలోనూ సామాజిక న్యాయం గురించి ప్రస్తావించారు.
సామాజిక న్యాయం చేస్తున్నప్పటికీ చంద్రబాబుకు బీసీలు ఎందుకు దూరం జరిగారు? అనేది పెద్ద ప్రశ్న. దానికి సమాధానం చెబుతూ ఇటీవల రాజకీయ వ్యూహకర్త(strategist) రాబిన్ శర్మ పెద్ద నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీలో ఒక్కో సామాజికవర్గం నుంచి ఒక్కో లీడర్ అందరికీ కనిపిస్తుంటారు. ఉదాహరణకు యాదవ్ సామాజికవర్గానికి యనమల రామక్రిష్ణుడు మాత్రమే 40ఏళ్లుగా టీడీపీ తెరపై ఉంటారు. లేదంటే ఆయన బంధువులు, అనుచరులు ఒకరిద్దరు పదవుల చేజిక్కించుకుంటారు. ఆ సామాజికవర్గంలోని మిగిలిన లీడర్లు పార్టీ కోసం 2019 వరకు పనిచేస్తూ వచ్చారు. అగ్రవర్ణ పేదలకు ఇచ్చిన 10శాతంలో రిజర్వేషన్ లో 5శాతం కాపులకు ప్రకటించగానే మెల్లగా వైసీపీ వైపు వెళ్లారు. ఇప్పుడు యనమల అండ్ బ్యాచ్ తప్ప యాదవ సామాజికవర్గం నుంచి టీడీపీకి పెద్దగా ఎవరూ కనిపించరు. ఆయన పట్ల ఆ సామాజికవర్గంలోనే వ్యతిరేకత ఉంది. వరుసగా తుని నుంచి ఓడిపోతూ వస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం యాదవ సామాజిక వర్గానికి నచ్చడంలేదు. ఇదే విషయాన్ని నివేదిక రూపంలో రాబిన్ శర్మ(Strategist) అందచేశారని తెలుస్తోంది.
మాదిగ సామాజిక వర్గం
ఇక మాదిగ సామాజిక వర్గం(social wing) నుంచి వర్ల రామయ్య కనిపిస్తుంటారు. పదేళ్లకు పైగా ఆయన లేకుండా ఉండే వేదిక కనిపించదు. ఒకసారి ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం లభించింది. అయినప్పటికీ గట్టిపోటీ కూడా ఇవ్వలేక ఓడిపోతూ వచ్చారు. అయినప్పటికీ సంస్థాగతంగా ఆయనకు పొలిట్ బ్యూర్ మెంటర్ లాంటి కీలక పదవిని చంద్రబాబు కట్టబెట్టారు. వర్ల రామయ్య 2009 ఎన్నికలకు ముందుగా ఎంట్రీ ఇచ్చి అత్యున్నత పదవిలో సంస్థాగతంగా ఇప్పుడు ఉన్నారు. మూడు సార్లు పార్టీ టిక్కెట్ ను చంద్రబాబు ఆయనకు ఇచ్చారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీని కనిపెట్టుకుని ఉన్న మాదిగ సామాజికవర్గం కుటుంబాలకు చెందిన లీడర్లు అనేక మంది ఉన్నారు. వాళ్లను కాదని వర్ల రామయ్యకు మాత్రమే ప్రతిసారి ప్రాధాన్యతను ఇవ్వడం టీడీపీలోని మాదిగలకు నచ్చడంలేదట. అందుకే 2019 ఎన్నికల్లో వైసీపీ వైపు మళ్లారని నివేదికలోని సారాంశం.
ఇక మాల సామాజికవర్గం(social wing) నుంచి టీడీపీ తరపున కనిపించే ఫేస్ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి. ఇప్పుడు ఆమె వారసురాలిగా కావలి గ్రీష్మ ప్రస్తుతం ఆ సామాజికవర్గం నుంచి ఎలివేట్ అవుతున్నారు. ఇలా ప్రతి జిల్లాలోనూ ఆనాదిగా టీడీపీలో ఉన్న సీనియర్ల కుటుంబీకులకు వారసత్వంగా పదవులు కల్పిస్తున్నారు. అంతేకాదు, వైసీపీ నుంచి వచ్చిన జూపూడి ప్రభాకర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు ఎస్పీ కార్పొరేషన్ పదవిని అప్పగించారు. 40ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న టీడీపీ కోసం పనిచేసిన మాల సామాజికవర్గం లీడర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ల నుంచి కొత్త నాయకత్వాన్ని చంద్రబాబు బయటకు తీయలేకపోయారు. ఫలితంగా 2019 ఎన్నికల నాటికి ఎస్సీ మాల సామాజికవర్గం లీడర్లు టీడీపీ నుంచి వైసీపీ వైపు వెళ్లారు. మాల సామాజికవర్గం లీడర్ గా జూపూడికి అధికారం ఇచ్చినప్పటికీ ఆయన తిరిగి వైసీపీకి వెళ్లిపోయారు.
ముస్లిం మైనార్టీ నాయకునిగా
ముస్లిం మైనార్టీ నాయకునిగా దశాబ్దాల పాటు గుంటూరుకు చెందిన జియావుద్దీన్ కుటుంబాన్ని టీడీపీ ఆదరించింది. వయోభారంతో చనిపోయే వరకు లాల్ జాన్ భాషాకు రాజ్యసభను ఇస్తూ చంద్రబాబు పెద్దపీఠ వేశారు. అనేక మంది ముస్లిం నాయకులు 1983 నుంచి టీడీపీకి పనిచేసే వాళ్లు ఉన్నారు. అయినప్పటికీ కేవలం ఒకే కుటుంబానికి చెందిన నాయకులను మాత్రమే సామాజిక ఈక్వేషన్ కోసం చూపడం చంద్రబాబు చేసిన పొరబాటుగా రాబిన్ శర్మ చూపుతున్నారని తెలుస్తోంది. ఎస్టీల్లోనూ అంతే, ఏదో ఒక కుటుంబాన్ని హైలెట్ చేస్తూ సామాజిక ఈక్వేషన్ పాటించారు. పాత తరాన్ని నమ్ముకుంటూ ఇచ్చిన వాళ్లకే మళ్లీమళ్లీ పదవులు ఇవ్వడం చంద్రబాబు 2019లో అధికారాన్ని కోల్పోవడానికి కారణంగా చెబుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన చంద్రమోహన్ రెడ్డి వరుసగా ఓడిపోతున్నప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా మంత్రిని చేశారు. ఆయన కారణంగా. నెల్లూరు జిల్లా టీడీపీ బలహీనపడిందని ప్రస్తుతం తరం బలంగా నమ్ముతోంది.
రాయలసీమలోనూ కేఈ సోదరులను వదిలించుకోలేక ఆ కుటుంబాన్ని టీడీపీ ఆది నుంచి వెనుకేసుకుని వస్తోంది. నాయకత్వం మార్పు 1983 నుంచి టీడీపీలో జరగకపోవడం పెద్ద డ్రా బ్యాక్ గా రాబిన్ శర్మ ఇచ్చిన నివేదికలోని ప్రధాన అంశంగా ఉందని తెలుస్తోంది. 1983 నుంచి అదే మొఖాలు లేదంటే ఆ కుటుంబాలకు చెందిన వారసులు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం టీడీపీకి పెద్ద మైనస్ గా ఉందని రాబిన్ శర్మ తేల్చారని సమాచారం. సామాజిక న్యాయాన్ని చంద్రబాబు పాటిస్తున్నప్పటికీ ఆదరణ లేకపోవడానికి కారణం అదేనంటూ నివేదిక రూపంలో విశ్లేషణ ఇచ్చారని వినికిడి. ఇప్పటికైనా సామాజిక న్యాయం రూపంలో తరతరాలుగా చూపుతోన్న ముఖాలను మార్చకపోతే నష్టమని భావిస్తున్నారు. ప్రస్తుతం మూసపద్దతిలో చంద్రబాబు చూపిస్తోన్న సామాజికన్యాయం క్యాడర్ ను సంతృప్తి పరిచే అవకాశం లేదని పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా పాత వాళ్లను వదిలించుకుని కొత్త వాళ్ల ద్వారా సామాజిక న్యాయాన్ని(social justice) చంద్రబాబు చూపాలని రాజకీయ వ్యూహకర్త(strategist) రాబిన్ శర్మ ఇచ్చిన నివేదిక ఉందని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పార్టీకి తెల్ల ఏనుగుల మాదిరిగా ఉన్న వాళ్లను తొలగించాలని చాలా కాలంగా లోకేష్ కూడా భావిస్తున్నారట. ఇలాంటి పరిణామాల మధ్య చంద్రబాబు ఇచ్చే పరిష్కారం ఏమిటో చూద్దాం!
CBN Meetings : చంద్రబాబు సభల సక్సెస్!`జన సందోహం` సీక్రెట్