TDP Survey : జిల్లాల వారీగా `టీడీపీ ర‌హ‌స్య స‌ర్వే` ఇదే!

ఎన్నిక‌లు ఇంకా ఏడాదిన్న‌ర‌కు పైగా ఉన్న‌ప్ప‌టికీ తెలుగుదేశం ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేల‌ను ప‌రిశీలిస్తోంది. తాజాగా సేక‌రించిన స‌ర్వే ప్ర‌కారం కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు ఖాయంగా క‌నిపించింది.

  • Written By:
  • Updated On - August 30, 2022 / 03:47 PM IST

ఎన్నిక‌లు ఇంకా ఏడాదిన్న‌ర‌కు పైగా ఉన్న‌ప్ప‌టికీ తెలుగుదేశం ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేల‌ను ప‌రిశీలిస్తోంది. తాజాగా సేక‌రించిన స‌ర్వే ప్ర‌కారం కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు ఖాయంగా క‌నిపించింది. స్వ‌ల్ప తేడాతో ఉండే నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ట్టు గుర్తించింది. ఇక ఓడిపోయే స్థానాలు పెద్ద‌గా లేక‌పోయిన‌ప్ప‌టికీ నిర్ల‌క్ష్యం చేసే చేజారి పోయే నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. ఒక ప్రైవేటు స‌ర్వేను కూడా సేక‌రించిన టీడీపీ సుమారు 79 స్థానాల్లో ఎడ్జిలో ఉన్న‌ప్ప‌టికీ నిర్ల‌క్ష్యం చేస్తే ఓట‌మి చ‌విచూడాల్సి వ‌స్తుంద‌ని అధ్య‌య‌నం చేసిన‌ట్టు పార్టీ అంత‌ర్గ‌త వ‌ర్గాల్లోని వినికిడి.

ఈనెల 25త తేదీ నాటికి గ్రౌండ్ రియాలిటీ ప్రకారంతెలుగు దేశం పార్టీ గెలుపు కోసం మరింత దృష్టి పెట్ట‌డంతో పాటు గరిష్ట ప్రయత్నాలు చేయాల్సిన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల జాబితాను త‌యారు చేసింద‌ని స‌మాచారం. ఆ జాబిత‌ను `హ్యాష్ ట్యాగ్ యూ` ప్ర‌త్యేకంగా ఒక ప్రైవేటు సంస్థ నుంచి సేక‌రించింది. ఆ స‌ర్వే ప్ర‌కారం ఎడ్జిలో ఉన్న అసెంబ్లీ నియెజ‌క‌వ‌ర్గాల జాబితా ఇలా ఉంది. క‌ష్ట‌ప‌డితేగానీ గెలుపు సాధ్యం అయ్యే నియోజ‌క‌వ‌ర్గాల జాబితాను తాజాగా ఆ ప్రైవేటు సంస్థ టీడీపీకి అంద‌చేసింది. తూర్పు గోదావ‌రి, కృష్ణా, గుంటూరు, ప్ర‌కాశం జిల్లా విశాఖ జిల్లాల్లో ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డాల్సి ఉంది. ఈ జాబితాలోని నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా మిగిలిన వాటిలో టీడీపీ క్లియ‌ర్ గెలుపు దిశ‌గా ఉన్నాయ‌ని ఆ స‌ర్వేలోని సారాంశం. ఆ స‌ర్వే నివేదిక ప్ర‌కారం జిల్లాల వారీగా టీడీపీ బాగా కష్ట‌డాల్సిన అసెంబ్లీ నియోజ‌వ‌ర్గాల జాబితా ఇలా ఉంది.

విశాఖపట్నం జిల్లా
1.చోడవరం.2.మాడుగుల 3.యెల్లమంచిలి 4.అనకాపల్లి.5.వైజాగ్ (ఉత్తరం)6.వైజాగ్ (దక్షిణం)

విజయనగరం జిల్లా
1. చీపురపల్లి.2.గజపతినగరం.3.కురుపాం 4. సాలూరు .5.పార్వతీపురం.

శ్రీకాకుళం జిల్లా
1.పలాస 2.టెక్కలి 3.నరసన్నపేట 4.పల్తపట్నం 5.పాలకొండ .

తూర్పుగోదావరి జిల్లా
1.రాజమండ్రి రూరల్.2.రామచంద్రపురం 3.అమలాపురం.4.పి.గన్నవరం.5.రాజనగరం.6.రంపచోడవరం. 7.కాకినాడ అర్బన్ 8.కాకినాడ రూరల్

పశ్చిమగోదావరి జిల్లా
1.భీమవరం ,2నర్సాపురం.3.తాడేపల్లిగూడెం 4.చింతలపూడి

(ఎఫ్)కృష్ణా జిల్లా
1.గ‌న్న‌వ‌రం.2.కైకలూరు 3.పెడ‌న‌ 4. విజయవాడ(పశ్చిమ) 5.పామర్రు

గుంటూరు జిల్లా
(1). తాడికొండ 2.గుంటూరు పశ్చిమ 3.సత్తెనపల్లి 4.ప్రత్తిపాడు 5.మాచర్ల

ప్రకాశం జిల్లా
1.మార్కాపురం 2.దర్శి 3.సంతనూతల పాడు.4.చీరాల.5.యెర్రగొండపాలెం

నెల్లూరు జిల్లా
1.నెల్లూరు సిటీ 2.కోవూరు 3. కావలి 4. గూడూరు

.అనంతపురం జిల్లా
1.పుట్టపర్తి 2.అనంతపురం 3. రాప్తాడు 4.ధర్మవరం.(5). కళ్యాణదుర్గం

కర్నూలు జిల్లా
1.డోన్ 2.కర్నూలు.3.ఆళ్లగెడ్డ 4.ఆదోని 5.పాణ్యం 6 ఆలూరు

చిత్తూరు జిల్లా
1. జి.డి.నెల్లూరు.2.తిరుపతి 3.పూతలపట్టు

కడప జిల్లా
1.రాజంపేట 2.మైదుకూరు 3.జమ్మలమడుగు 4.ప్రొద్దుటూరు