Shark Tank Show : శ్రీకాంత్ బొల్లా పేరు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. ఎంతోమంది తెలుగు నెటిజన్లు ఆయన గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఈయన ఎవరు ? ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతున్నారు ? ఆయనను చూసి అందరూ స్ఫూర్తి ఎందుకు పొందుతున్నారు ? తెలుసుకుందాం..
Also Read :Aadhaar Voter Card Seeding: ఓటర్ ఐడీతో ఆధార్ లింక్.. ఈసీ కీలక ప్రకటన
షార్క్‌గా శ్రీకాంత్ బొల్లా
‘షార్క్ ట్యాంక్ ఇండియా’ షో గురించి మనకు తెలుసు. ఇది చాలా పాపులర్. యువ వ్యాపారవేత్తలు తమ ఐడియాలను చెప్పేందుకు ఈ షో వేదికగా నిలుస్తుంది. అంతేకాదు.. బిజినెస్ ఐడియా బాగుంటే షార్క్‌ల నుంచి పెట్టుబడి ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఎంతోమంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు ట్రై చేస్తుంటారు. ఈ షోకు షార్క్‌కు వ్యవహరించడం అంటే మామూలు విషయం కాదు. మంచి బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లకే షార్క్‌గా అవకాశం ఇస్తారు. ఈ అరుదైన అవకాశాన్ని మన ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంకు చెందిన దివ్యాంగ వ్యాపారవేత్త శ్రీకాంత్ బొల్లా దక్కించుకున్నారు. ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ షో నాలుగో సీజన్‌లో మన శ్రీకాంత్ బొల్లా(Shark Tank Show) గెస్ట్ షార్క్‌గా వ్యవహరించారు. ఈసందర్భంగా పలు స్టార్టప్ కంపెనీల్లో ఈయన పెట్టుబడి పెట్టారు. ఈ ఎపిసోడ్ ఇంకా ప్రసారం కాలేదు. దీనికి సంబంధించిన ప్రోమోను సోనీలివ్ తాజాగా విడుదల చేసింది. దాన్ని మీరు యూట్యూబ్‌లోనూ చూడొచ్చు. ఈ షోలో అనుమప్ మిట్టల్ (షాదీ.కామ్), అమన్ గుప్తా (బోట్), వినీతా సింగ్ (షుగర్ కాస్మోటిక్స్), నమితా థాపర్ (ఎమ్‌క్యూర్ ఫార్మా), పీయూష్ బన్సల్ (లెన్స్‌కార్ట్) షార్క్స్‌గా వ్యవహరిస్తుంటారు. వారితో శ్రీకాంత్ దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read :China Army In Pak: పాకిస్తాన్ గడ్డపైకి చైనా ఆర్మీ.. కారణం ఇదే
శ్రీకాంత్ బొల్లా నేపథ్యం..
- శ్రీకాంత్ బొల్లా మచిలీపట్నంలో 1992 జులై 7న జన్మించారు.
- వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు.
- ఇంజినీరింగ్ చదవాలని శ్రీకాంత్ భావించారు. అయితే అంధుడని చెప్పి, ఐఐటీ నిర్వాహకులు అడ్మిషన్ ఇవ్వలేదు.
- దీంతో అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్‌లో చేరారు. ఈ కోర్సులో చేరిన తొలి అంధుడిగా శ్రీకాంత్ రికార్డును సొంతం చేసుకున్నారు.
- ఆ తర్వాత ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీలలో ఆయనకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అయినా వాటికి నో చెప్పారు.
- 2012లో హైదరాబాద్ కేంద్రంగా బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను శ్రీకాంత్ స్థాపించారు. దీని ద్వారా 2,500 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు.
- మూడు వేల మంది దివ్యాంగులకు ఆయన ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు.
- శ్రీకాంత్ తన పరిశ్రమలలో సౌర విద్యుత్తును వినియోగిస్తారు.
- 2005లో లీడ్ ఇండియా కార్యక్రమం ద్వారా లక్షల మందిని ఉద్దేశించి ఆయన స్ఫూర్తి ప్రసంగాలు చేశారు.
- శ్రీకాంత్ జీవితం ఆధారంగా 2014లో బాలీవుడ్‌లో ‘శ్రీకాంత్’ పేరుతో ఓ మూవీ రిలీజ్ అయింది. ఇందులో హీరో రాజ్‌కుమార్ రావ్ ‘శ్రీకాంత్ బొల్లా’గా నటించారు.
- 2017లో ఫోర్బ్స్ మేగజైన్‌లో ఆసియా 30 అండర్ 30 జాబితాలో శ్రీకాంత్‌కు చోటు దక్కింది.