Site icon HashtagU Telugu

Atchannaidu: రేవంత్ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలి: అచ్చెన్నాయుడు

Atchannaidu

Atchannaidu

Atchannaidu: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ ప్రజల్లో ఉంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని అచ్చెన్నాయుడు కొనియాడారు. రేవంత్ తన రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని, పరాజయాలు చవిచూశారని, గెలుపు ఓటములను ఎదుర్కొన్నారని అన్నారు.

రేవంత్ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలిపారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన ఎ. రేవంత్ రెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అభినందించారు.

రాష్ట్ర పురోగతి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. X లో పోస్ట్ లో ప్రధాన మంత్రి, “తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర పురోగతి మరియు పౌరుల సంక్షేమం కోసం నేను అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇస్తున్నాను.” అంటూ రియాక్ట్ అయ్యారు. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.