Union Budget 2024-25 : నిరాశలో తెలంగాణ..సంబరాల్లో ఏపీ

యువతరం కలలు నెరవేర్చే బడ్జెట్ , దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్‌ , మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసే బడ్జెట్

  • Written By:
  • Publish Date - July 23, 2024 / 03:54 PM IST

దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్న బడ్జెట్ (Union Budget 2024-25) వచ్చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మంగళవారం లోక్ సభ (Lok Sabha)లో ప్రవేశ పెట్టారు. యువతరం కలలు నెరవేర్చే బడ్జెట్ , దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్‌ , మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసే బడ్జెట్, చిరువ్యాపారులు, ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి కొత్త పథకాలు తీసుకొచ్చే బడ్జెట్ ఇలా అన్ని విధాలా మేలు జరిగే బడ్జెట్ ను తీసుకొచ్చామని ప్రధాని మోడీ (PM Modi) అంటుంటే .. తెలంగాణ (Telangana) ప్రజలు మాత్రం ప్రధాని మోడీ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి బడ్జెట్ లో తెలంగాణ ప్రజల కోర్కెలు తీరుస్తాడని ఏకంగా 08 మంది ఎంపిలను ఇస్తే..మాకు మాత్రం ‘0’ బడ్జెట్ ఇచ్చారని మండిపడుతున్నారు. ఈ బడ్జెట్‌ కేవలం చంద్రబాబు, నితీష్ కుమార్‌కు మేలు జరిగేలా ఉంది తప్ప తెలంగాణ ప్రజలకు ఏమాత్రం మేలు జరగలేదని వాపోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ములుగు యూనివర్సిటీకి అదనపునిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, తెలంగాణ నుంచి ముంబై- నాగపూర్, బెంగళూరు- చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు, మెగా పవర్ లూమ్ క్లస్టర్‌తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు వంటి వాటి గురించి బడ్జెట్ లో ఊసే ఎత్తలేదని మండిపడుతున్నారు. ఓవరాల్ గా కేంద్రం మరోసారి తెలంగాణ కు మొండిచెయ్యి చూపించిందని అంటున్నారు.

ఇక ఏపీ (AP)లో మాత్రం బడ్జెట్ ఫై సంబరాలు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్‌ ద్వారా ఏపీకి నూతన విశ్వాసాన్ని కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెపుతున్నారు. ఐదు కోట్లమంది రాష్ట్ర ప్రజలకు ఊపిరి పీల్చుకునే బడ్జెట్‌ ఇది అని మంత్రులు అంటున్నారు. అమరావతికి రూ.15వేల కోట్లు ఇవ్వడం హర్షణీయమని ఎంపీ శ్రీ భరత్ అన్నారు. ప్రత్యేక సాయం ప్రకటించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.

అమరావతి (Amaravathi) అభివృద్ధికి రూ.15 వేల కోట్లు కేటాయించినట్లు ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. అంతే కాదు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి పూర్తిగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ – బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ‘ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నాం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సాయం చేస్తాం. విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించడం సహా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం.’ అని మంత్రి పేర్కొన్నారు. ఇలా మంత్రి వరుస హామీలు ఇవ్వడం తో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.

Read Also : KTR : కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం

Follow us