AP HighCorut: తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలోని మెజిస్ట్రేట్లకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులపై నమోదయ్యే కేసులకు సంబంధించి, న్యాయపరంగా ఎలా వ్యవహరించాలో స్పష్టమైన మార్గదర్శకాలు సూచిస్తూ ప్రత్యేక సర్క్యులర్ విడుదల చేసింది.
ఈ సందర్భంలో హైకోర్టు, ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తప్పకుండా అనుసరించాలని పేర్కొంది. ఆధారాలు లేకుండా, ప్రాథమిక విచారణ జరపకుండా మాట్లాడిన మాటలు, రాసిన రచనలు, కళాత్మకంగా వ్యక్తమైన అభిప్రాయాలపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని సమీక్షించాలని స్పష్టం చేసింది.
రిమాండ్‌కు ముందు పోలీసులు చట్టం ప్రకారం పనిచేశారా? అనే అంశాన్ని మెజిస్ట్రేట్‌లు గమనించాలని, విచారణ అనంతరమే నిందితులను రిమాండ్‌కు పంపాలని ఆదేశించింది. ప్రతి మెజిస్ట్రేట్ ఈ సర్క్యులర్‌ను అనుసరించాల్సిందేనని, ఆదేశాల్ని ఉల్లంఘిస్తే ఇది తేలికగా తీసుకోబోమని హెచ్చరించింది.
ఇంతకు ముందు మార్చి 28న సుప్రీం కోర్టు ఇచ్చిన ‘ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్’ కేసులో తీర్పును ఉదహరిస్తూ… అభిప్రాయ స్వేచ్ఛ, భావప్రకటన హక్కుల పరిరక్షణ అవసరమని హైకోర్టు గుర్తు చేసింది. సోషల్ మీడియా కేసుల్లో క్రిమినల్ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ సర్క్యులర్‌తో న్యాయ వ్యవస్థలో ఓ కీలక మలుపు తిరిగినట్టు భావిస్తున్నారు. వ్యక్తుల హక్కులను గౌరవించడమే కాక, అధికార బద్ధంగా వ్యవహరించాలన్న హైకోర్టు ఈ దిశగా కీలక చర్యలు తీసుకుంది.
Gold- Silver Prices: తొలి ఏకాదశి రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?