KCR Master Plan: ఏపీలో `కేసీఆర్` మ‌హాకూట‌మి?

ఏపీపై రాజ‌కీయ దండ‌యాత్ర‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దం అవుతున్నారు. ఆ మేర‌కు ప‌లు కోణాల నుంచి ప్ర‌శాంత్ కిషోర్ ద్వారా స‌ర్వేల‌ను అధ్య‌య‌నం చేసిన‌ట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - September 21, 2022 / 02:37 PM IST

ఏపీపై రాజ‌కీయ దండ‌యాత్ర‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దం అవుతున్నారు. ఆ మేర‌కు ప‌లు కోణాల నుంచి ప్ర‌శాంత్ కిషోర్ ద్వారా స‌ర్వేల‌ను అధ్య‌య‌నం చేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఏపీ రాజ‌కీయాల్లో శూన్య‌త ఉంద‌ని పీకే ఇచ్చిన రిపోర్టులోని ప్ర‌ధాన అంశాన్ని ప‌రిశీలిస్తున్నార‌ట‌. జాతీయ పార్టీని ద‌స‌రా రోజును ప్ర‌క‌టించాల‌ని ప్ర‌య‌త్నిస్తోన్న కేసీఆర్ ఆ త‌రువాత ఏపీలోకి డైరెక్ట్ ఎంట్రీ రాజ‌కీయంగా ఇస్తార‌ని తెలుస్తోంది.

ఈనెల 25న విజ‌య‌వాడ కేంద్రంగా సీపీఐ జాతీయ స‌మావేశాల సంద‌ర్భంగా బ‌హిరంగ స‌భ జ‌ర‌గ‌నుంది. ఆ స‌భ‌కు కేసీఆర్ హాజ‌రు కానున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని శంకుస్థాప‌న సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ వేదిక‌గా కేసీఆర్ ప్ర‌సంగించారు. ఆ త‌రువాత ఏపీకి వివిధ అంశాల‌పై వెళ్లిన‌ప్ప‌టికీ బ‌హిరంగ స‌భ‌ల్లో ఎక్క‌డా పాల్గొన‌లేదు. సుదీర్ఘ కాలం త‌రువాత సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శ స‌మావేశాల్లో పాల్గొని బ‌హిరంగ‌స‌భ‌లో ఆయ‌న స్పీచ్ ఇవ్వ‌నున్నారు. ఆ రోజున ఆయ‌న ఇచ్చే దిశానిర్దేశం ఆధారంగా ఏపీ రాజ‌కీయాల్లో పెనుమార్పులు సంభ‌వించే అవ‌కాశం ఉంది.

Also Read:   Jeevitha and Vijayasanthi: జహీరాబాద్ బరిలో జీవిత.. విజయశాంతి సంగతేంటి?

ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ, టీడీపీ బ‌లంగా ఉన్నాయి. వాటిని ఢీ కొట్టేందుకు బీజేపీ, జ‌న‌సేన కూట‌మి కొన్నేళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ డిపాజిట్లు సంపాదించే స్థాయి వ‌ర‌కు కూడా ఆ రెండు పార్టీలు చేర‌లేదు. ప్ర‌స్తుతం జ‌న‌సేన, బీజేపీ పొత్తు ఉన్న‌ప్ప‌టికీ ఎక్క‌డా క్షేత్ర‌స్థాయిలో కలిసి ప‌నిచేయ‌డంలేదు. ఎన్నిక‌ల నాటికి దాదాపుగా ఆ రెండు పార్టీల పొత్తు తెగిపోయే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అందుకే, జ‌న‌సేన పార్టీతో కేసీఆర్ పెట్ట‌బోయే జాతీయ పార్టీ జ‌త క‌ట్ట‌నుంద‌ని తెలుస్తోంది. జాతీయ రాజ‌కీయ ఈక్వేష‌న్ ఆధారంగా కమ్యూనిస్ట్ లు, టీఆర్ఎస్ పార్టీ పంచ‌న దాదాపుగా చేరిన‌ట్టే చెప్పుకోచ్చు. అందుకు ఉదాహ‌ర‌ణ మునుగోడు ఎన్నిక‌ల ఈక్వేష‌న్ ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. ఏపీలోనూ ఎన్డీయే ప్ర‌భుత్వానికి వైసీపీ, టీడీపీ ప్ర‌త్య‌క్షంగానూ ప‌రోక్షంగానూ మ‌ద్ధ‌తు ప‌లుకుతున్నాయి. దీంతో ఆ రెండు పార్టీల‌తో క‌లిసి కామ్రేడ్లు ప‌నిచేయ‌లేరు. ప్ర‌త్యామ్నాయంగా కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీ వైపు మొగ్గు చూప‌డానికి ఛాన్స్ ఉంది.

2019 ఎన్నిక‌ల్లో క‌లిసి ప‌నిచేసిన క‌మ్యూనిస్ట్ లు, జ‌న‌సేన‌, కేసీఆర్ పెట్ట‌బోయే జాతీయ పార్టీ ఒక కూట‌మిగా ఏర్ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు. అంతేకాదు, ఆ కూటమిలో ఎంఐఎం కూడా చేర‌డానికి సిద్ధంగా ఉంద‌ని తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లోనే ఏపీ నుంచి పోటీ చేయ‌డానికి ఎంఐఎం ప్ర‌య‌త్నం చేసింది. కానీ, ఆనాడున్న ప‌రిస్థితుల్లో చివ‌రి నిమిషంలో వెన‌క్కు త‌గ్గింది. ఈసారి క‌నీసం ఐదు చోట్ల పోటీకి దిగాల‌ని ఎంఐఎం ప్ర‌య‌త్నం చేస్తోంద‌ట‌. అంటే, 2024 నాటికి కేసీఆర్‌, ప‌వ‌న్, అస‌రుద్దీన్, సీపీఐ నారాయ‌ణ‌, సీపీఎం రాఘువులు లాంటి పెద్ద‌లు ఏపీ వేదిక‌పై క‌నిపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది.

Also Read:   Munugode Elections : మునుగోడులో మెజార్టీ తెచ్చిన కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి అదిరిపోయే ఆఫర్!!

ప్ర‌త్యేక‌హోదా మీద ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చిన నితీష్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి ద‌గ్గ‌ర‌వుతున్నారు. రాహుల్ చేప‌ట్టిన భారత్ జోడో యాత్ర‌కు బీహార్ సీఎం నితీష్‌, డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ మ‌ద్ధ‌తు ప‌లికారు. మ‌రో వైపు కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీకి ద‌గ్గ‌ర‌వుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ వేదిక‌గా బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్ గ‌ళం విప్పింది. ఈ ప‌రిణామాల‌న్నీ గ‌మ‌నిస్తే, ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ కూట‌మిలో చేర‌డానికి ఛాన్స్ ఉంది. మొత్తం మీద కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీ, జ‌న‌సేన‌, ఉభ‌య క‌మ్యూనిస్ట్ లు, ఎంఐఎం, కాంగ్రెస్ క‌లిసి మ‌హాకూట‌మిగా ఏర్ప‌డి ఏపీ మీద రాజ‌కీయ దండ‌యాత్ర చేసేందుకు సిద్ధం అవుతున్నాయ‌ని తెలుస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నితీష్‌, రాహుల్‌, కేసీఆర్‌, అస‌రుద్దీన్ , క‌మ్యూనిస్ట్ యోధులు, ప‌వ‌న్ ఒక వేదిక‌పై కనిపిస్తే ఏపీ రాజ‌కీయాలు సంపూర్ణంగా ట‌ర్న్ అయ్యే అవ‌కాశం ఉంది. ఆ దిశ‌గా ప్ర‌శాంత్ కిషోర్ ఒక స‌ర్వే నివేదిక‌ను ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అదే జ‌రిగితే, తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుకు భారీగా గండిప‌డ‌నుంద‌ని పీకే స‌ర్వేలోని సారంశం. తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ లీడ‌ర్ల మీద నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ త‌ర‌హాలోనే ఏపీలోనూ అదే ఫార్ములాను ఉప‌యోగించాల‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. మొత్తం మీద టీడీపీకి గండికొట్టే మాస్ట‌ర్ స్కెచ్ వేస్తూ ఏపీలో ఎంట్రీ ఇవ్వ‌నున్న కేసీఆర్ ప్ర‌భావం ఎంత‌ ఉంటుందో చూడాలి.