వైరల్ : బంగారం కోసం వృద్ధురాలిపై హత్యాయత్నం

  • Written By:
  • Publish Date - January 30, 2024 / 02:47 PM IST

ఏపీలో దొంగలు రెచ్చిపోతున్నారు. కొద్దీ రోజుల క్రితం వాలెంటర్ గా పనిచేస్తున్న ఓ యువకుడు డబ్బు , బంగారం కోసం వృద్ధురాలిని చంపిన ఘటన ఇంకా మాట్లాడుకుంటుండగానే…తాజాగా అనకాపల్లిలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. బంగారం కోసం వృద్ధురాలిపై హత్యాయత్నం చేయబోయాడు ఓ వ్యక్తి. దీనికి సంబదించిన సీసీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

అనకాపల్లి గవరపాలెం పార్క్ సెంటర్‌లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు లక్ష్మీ నారాయణమ్మ మెడకు టవల్ బిగించి ఓ వ్యక్తి హత్యాయత్నం చేశాడు. ఆమె మెడలోని ఎనిమిది తులాల గోల్డ్ చైన్‌ను కాజేశాడు. ఈ తతంగం అంతా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. కేబుల్‌లో పని చేసే గోవింద్‌ అనే వ్యక్తి వృద్ధురాలిపై దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అతనిపై బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన 2024 జనవరి 26 రాత్రి 7:30 గంటల ప్రాంతంలో జరిగింది.

Read Also : Nara Bhuvaneshwari : నారా భువనేశ్వరి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య