Site icon HashtagU Telugu

CM YS Jagan: సీఎం జగన్ విమానంలో సాంకేతిక లోపం.. తప్పిన ప్రమాదం

Jagan Ao

Jagan Ao

CM YS Jagan: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. తాను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపము తలెత్తడంతో టేక్ ఆఫ్ అయిన కొంత సమయానికే ల్యాండ్ అయిపోయింది. సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని సేఫ్ ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఎలాంటి నష్టం జరగలేదని, సమస్య కారణాలు లోపం సంభవించడానికి గల కారణాలు గుర్తించి, సరిదిద్దే పనిలో మునిగిపోయారు సిబ్బంది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఢిల్లీలో జరగనున్న “గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు” సన్నాహక సమావేశం కోసం ఢిల్లీ వెళ్తున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే ఏసీ వాల్వ్‌లో లీకేజి కారణంగా ప్రైజరైజేషన్‌ సమస్య తలెత్తిందని, దీన్ని పైలట్‌ గుర్తించినట్టుగా ప్రాథమికంగా తెలిసిందని అధికారులు తెలిపారు. సమస్యను వెంటనే గుర్తించిన పైలట్‌ తిరిగి గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు. మొత్తానికి పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఫ్లైట్ ని సేఫ్ గా ల్యాండ్ చేసాడు.

సాయంత్రం 5:03 సమయానికి ఢిల్లీ పర్యటన కోసం ముఖ్యమంత్రి, అధికారుల బృందం ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్‌ అయ్యింది. కొంత సేపటికే విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ ఉందని పైలట్ గుర్తించారు. గుర్తించిన వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. అలా తిరిగి సాయంత్రం 5:27 గంటలకు గన్నవరంలో ల్యాండ్‌ అయ్యారు. సమస్యను గుర్తించిన వెంటనే విమానాన్ని మళ్లించడంతో పెనుప్రమాదం తప్పిందండి అధికార వర్గాలు వెల్లడించాయి.

విమానం గన్నవరంలో సేఫ్ ల్యాండ్ అయిన తర్వాత సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. తిరిగి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లేందుకు ప్రభుత్వ అధికార వర్గాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. వేరే ఏర్పాట్ల ద్వారా ఈ రాత్రికే ఢిల్లీకి సీఎం జగన్‌ వెళ్లనున్నారని సమాచారం. ఎలాంటి దుర్ఘటన జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.