Site icon HashtagU Telugu

Tirumala : తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న టీమిండియా క్రికెట‌ర్లు రిష‌బ్ పంత్‌, అక్ష‌ర్ ప‌టేల్‌

Team INDIA

Team INDIA

టీమిండియా క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనం తర్వాత.. రిష‌బ్ పంత్, అక్ష‌ర్ ప‌టేల్‌తో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీప‌డ్డారు. వీరిద్దరితో ఫొటోలు దిగేందుకు టీటీడీ సిబ్బంది కూడా ఆసక్తి చూపారు. కాగా గాయాల కారణంగా పంత్, అక్షర్ ప్రస్తుతం టీమ్ ఇండియాకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది చివర్లో కారు ప్రమాదానికి గురైన పంత్ కోలుకునే దశలో ఉండగా, అక్షర్ ఇటీవల ప్రపంచకప్‌కు ఎంపికైన తర్వాత గాయపడ్డాడు. అక్షర్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ టీమ్ ఇండియాకు ఎంపికయ్యాడు. 2023 వన్డే ప్రపంచకప్ లో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎడిషన్‌లో భారత్ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఏడింటిలో విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 302 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఎడిషన్‌లో, లీగ్ దశలో భారత్ ఇంకా రెండు మ్యాచ్‌లు (దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్) ఆడాల్సి ఉంది.

Also Read:  TDP : తిరువూరు టీడీపీ సీటుపై క‌న్నేసిన వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి