Cricketer KS Bharat: సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన టీమిండియా క్రికెట‌ర్ కోన శ్రీ‌క‌ర్ భ‌ర‌త్.. సీఎంకు జెర్సీ బ‌హుక‌ర‌ణ‌

క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఒక క్రికెటర్‌గా చాలా బావుంద‌ని, మున్ముందు ఇలాంటి ప్రోత్సాహం వల్ల నాలాంటి క్రీడాకారులు మరింతగా వెలుగులోకి వస్తార‌ని భ‌ర‌త్ అన్నారు.

  • Written By:
  • Updated On - June 15, 2023 / 07:12 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) ని టీమిండియా క్రికెట్ ప్లేయ‌ర్ కోన శ్రీ‌క‌ర్ భ‌ర‌త్ (Kona Srikar Bharat) మ‌ర్యాదపూర్వ‌కంగా క‌లిశారు. గురువారం సీఎం క్యాంప్ కార్యాల‌యంకు వెళ్లిన భ‌ర‌త్.. సీఎం జ‌గ‌న్‌తో కొద్దిసేపు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా కేఎస్ భ‌ర‌త్‌ను సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినందించారు. టీం స‌భ్యుల ఆటో గ్రాఫ్‌తో కూడిన జెర్సీని భ‌ర‌త్ ముఖ్య‌మంత్రికి బ‌హుక‌రించారు. అనంత‌రం క్రికెట‌ర్ భ‌ర‌త్ మాట్లాడుతూ.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం అయ్యాక ఇండియన్‌ క్రికెట్‌ టీంకు ఏపీ నుంచి మొదటగా ప్రాతినిధ్యం వహించడం నాకు గర్వంగా ఉంద‌ని అన్నారు. సీఎం జ‌గన్ కూడా చాలా సంతోషంగా ఫీల‌య్యార‌ని భ‌ర‌త్ తెలిపారు. మీరు నాకు ఇన్స్‌పిరేషన్‌గా భావిస్తూ, ఒక క్రికెటర్‌గా మీ మద్దతు నాకు అవసరమ‌ని సీఎం జ‌గ‌న్‌ను కోర‌డం జ‌రిగింద‌ని భ‌ర‌త్ అన్నారు.

దేశం గర్వపడేలా, మన రాష్ట్ర పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని సీఎం జ‌గ‌న్ సూచించార‌ని తెలిపారు. ఏపీలో మౌలిక వసతులు బాగా పెరుగుతున్నాయ‌ని, అలాగే స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ కూడా బావుంద‌ని భ‌ర‌త్ చెప్పారు. క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఒక క్రికెటర్‌గా చాలా బావుంద‌ని, మున్ముందు ఇలాంటి ప్రోత్సాహం వల్ల నాలాంటి క్రీడాకారులు మరింతగా వెలుగులోకి వస్తార‌ని భ‌ర‌త్ అన్నారు.

ఇదిలా ఉంటే.. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఇటీవ‌లే మాజీ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు క‌లిసిన విష‌యం విధిత‌మే. ఇటీవ‌లే అంబ‌టి రాయుడు ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లో ఆయ‌న ఏపీ రాజ‌కీయాల్లోకి వెళ్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఏపీలో వైసీపీలో అంబ‌టి రాయుడు చేర‌బోతున్నార‌ని, అందుకే సీఎం జ‌గ‌న్ తో భేటీ అయ్యార‌న్న ప్ర‌చారం ఏపీలో జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలోనే ఏపీ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న టీమిండియా కీప‌ర్ భ‌ర‌త్ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌ల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Chicken or Egg: కోడి ముందా.. గుడ్డు ముందా.. మొత్తానికి తేల్చేసిన సైంటిస్టులు?