Site icon HashtagU Telugu

AP Teachers Promotion: ఏపీలో టీచర్ల కు భారీగా పదోన్నతులు

Andhra Pradesh Secretariat

Andhra Pradesh Secretariat

ఓవైపు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సీపీఎస్ రద్దు డిమాండ్ తో ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న వేళ, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద సంఖ్యలో టీచర్లకు పదోన్నతి కల్పించింది. 4,421 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, 998 మంది స్కూల్ అసిస్టెంట్లను ప్రిన్సిపల్ (గ్రేడ్-2) పోస్టులకు అప్ గ్రేడ్ చేసింది. వివిధ స్థాయుల్లోని 2,342 ఉపాధ్యాయ పోస్టులను మార్పిడి చేయాలని నిర్ణయించింది.

అంతేకాదు, 52 ప్రీ స్కూళ్లను ఉన్నత పాఠశాలలుగా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు వెలువరించారు. జాతీయ విద్యావిధానాన్ని అనుసరించి పాఠశాల విద్యాశాఖలో వ్యవస్థీకృత సంస్కరణల అమలులో భాగంగా ఈ పదోన్నతుల నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం పేర్కొంది.