Home Work : హోం వర్క్ రాయలేదని పిల్లల్ని చెప్పుతో కొట్టిన టీచర్

Home Work : 2వ తరగతి చదువుతున్న చిన్నారులు హోం వర్క్ (Home Work) చేయలేదన్న కారణంతో టీచర్ అనిత వారిపై చెప్పులతో కొట్టిన ఘటన (Incident of being hit with sandals) తీవ్ర చర్చకు దారి తీసింది

Published By: HashtagU Telugu Desk
Teacher Hits Children With

Teacher Hits Children With

సత్యసాయి జిల్లా ధర్మవరం(Dharmavaram)లో ఉన్న జీనియస్ స్కూల్ (Genius School) లో దారుణ ఘటన వెలుగు చూసింది. 2వ తరగతి చదువుతున్న చిన్నారులు హోం వర్క్ (Home Work) చేయలేదన్న కారణంతో టీచర్ అనిత వారిపై చెప్పులతో కొట్టిన ఘటన (Incident of being hit with sandals) తీవ్ర చర్చకు దారి తీసింది. చిన్న వయసులో ఉండే విద్యార్థులపై ఇటువంటి దాడులు చేయడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Assassination Files: రాబర్ట్ ఎఫ్ కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యల ఫైళ్లు.. ఎలా చంపారు ?

చెప్పుతో కొట్టించుకున్న చిన్నారులు ఆ ఘటనను తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే స్కూల్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. పిల్లల శరీరంపై గాయాల్ని చూసిన తల్లిదండ్రులు టీచర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాలయంలో పిల్లల భద్రతే ప్రశ్నార్థకం అవుతుందని వారు మండిపడ్డారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లిన తర్వాత వారు స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించి పరిస్థితిని నియంత్రించేందుకు జోక్యం చేశారు. పోలీసుల జోక్యంతో స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పిన అనంతరం పరిస్థితి శాంతించింది. టీచర్ అనితపై తగిన చర్యలు తీసుకుంటామని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఈ ఘటనతో విద్యార్థుల భద్రతపై మరోసారి చర్చ ప్రారంభమైంది. చిన్నారులపై శారీరక దండనలు నిషిద్ధమన్న నియమాలు ఉండగానే ఇటువంటి చర్యలు జరగడం శోచనీయం.

  Last Updated: 11 Apr 2025, 11:37 AM IST