Site icon HashtagU Telugu

YCP vs TDP: వైసీపీ కి పోటీగా టీడీపీ ప్రోగ్రామ్ ‘ సైకో పోవాలి – సైకిల్ రావాలి’

YCP vs TDP: Tdp's Program 'psycho Povali Cycle Raavali' To Compete With Ycp

Tdp's Program 'psycho Povali Cycle Raavali' To Compete With Ycp

వైసీపీ (YCP) కి పోటీగా స్టిక్కర్లు ప్రోగ్రామ్ కు టీడీపీ శ్రీకారం చుట్టింది. అధికార వైసీపీ.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ నినాదాలు రాసిన స్టిక్కర్లను రాష్ట్రమంతా వైసీపీ (YCP) ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ఇంచార్జులు ఇంటింటికీ తిరిగి అతికిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పోటీగా ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అనే స్టిక్కర్ను టీడీపీ నేతలు అతికిస్తున్నారు. అయితే ఈ స్టిక్కర్లు ఏర్పాటు ఆలోచన ఎంపీ కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని చేయటం విశేషం. ఈ స్టిక్కర్లపైన కేవలం తన ఫొటోను చంద్రబాబు ఫొటోను ఎన్టీఆర్ లోకేష్ అచ్చెన్నాయుడు స్థానిక టీడీపీ నియోజకవర్గ ఇంచార్జుల ఫొటోలను మాత్రమే ఆయన వేశారు. స్థానిక ఎంపీ అయిన కేశినేని నాని ఫొటో ఎక్కడా ఈ స్టిక్కర్లపైన లేకపోవడం గమనార్హం.

కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో అన్నక్యాంటీన్లు వైద్య శిబిరాలు ఇతర సేవా కార్యక్రమాలు చేపడుతున్న కేశినేని చిన్ని ఈ స్టిక్కర్లపై కేశినేని నాని ఫొటోలు లేకుండా చేయడం గమనార్హం. దీంతో కేశినేని సోదరుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టిక్కెట్ చిన్ని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేశినేని చిన్ని చేపడుతున్న కార్యక్రమాలు చర్చకు దారి తీస్తున్నాయి. విజయవాడ ఎంపీ అయిన తన సోదరుడు నాని ఫొటో ఎక్కడా ఉండటం లేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జి కేశినేని నాని ఉన్నారు. అయితే అక్కడ అంటించే స్టిక్కర్లపై బుద్దా వెంకన్న నాగుల్ మీరా చిత్రాలు వేశారు. అలాగే జగ్గయ్యపేటలో శ్రీరాం తాతయ్య నందిగామలో తంగిరాల సౌమ్య మైలవరంలో దేవినేని ఉమా తిరువూరులో శావల దేవదత్ విజయవాడ సెంట్రల్ లో బోండా ఉమా తూర్పులో గద్దె రామ్మోహన్ చిత్రాలను కేశినేని చిన్ని స్టిక్కర్లపై ముద్రించడం గమనార్హం.

ఈ నేపథ్యంలో కేశినేని నాని టీడీపీ నుంచి అవుట్ అయినట్టేనని చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కేశినేని చిన్నికే టికెట్ ఖాయమనే ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటూ ఉండే చిన్ని ఇటీవల కాలంలో తన జోరు పెంచారు. విజయవాడలోనే ఎక్కువ రోజులు గడుపుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతలు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి కేశినేని చిన్నినే ఎంపీగా పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేశినేని నాని అప్పట్లోనే తన సోదరుడు పేరు ఎత్తకుండా ఘాటు విమర్శలు చేశారు. ఎవరికి టికెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని తన సోదరుడు చిన్నికి మాత్రం ఇవ్వవద్దన్నారు.

టీడీపీ ఎంపీ కేశినేని నాని గత కొంత కాలంగా టీడీపీ అధిష్టానంపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలుమార్లు కేశినేని నాని వ్యవహారం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయనపై టీడీపీ అధిష్టానం వేటు వేస్తుందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పని చేయలేదు. కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తున్నారు. అందుకే ఇప్పుడు వైసీపీ (YCP) ప్రోగ్రామ్ కు పోటీగా టీడీపీ స్టిక్కర్లు అందిస్తూ దూసుకు వెళ్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ప్రోగ్రామ్ పెడితే బాగుంటుందని టీడీపీ భావిస్తుంది.

Also Read:  FBI Warning to the Public: మీ ఫోన్ ను పబ్లిక్ ఛార్జర్‌ తో ఛార్జ్ చేస్తున్నారా? FBI ఇచ్చిన వార్నింగ్ చూసుకోండి..

Exit mobile version