భారత రాజకీయాల్లో కీలకమైన కూటముల్లో ఒకటిగా ఎన్డీఏతో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) బంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్డీఏ(Alliance with NDA)తో తమ దీర్ఘకాలిక బంధం గురించి కీలక ప్రకటన చేశారు. 2029 తర్వాత కూడా టీడీపీ ఎన్డీఏతో గట్టిగా నిలబడుతుందని లోకేష్ (Lokesh) స్పష్టం చేశారు. ఈ కూటమి భారతదేశ వృద్ధికి, స్థిరత్వానికి ఒక నిబద్ధత అని ఆయన అభిప్రాయపడ్డారు. దీని ద్వారా టీడీపీ కేవలం రాష్ట్ర ప్రయోజనాలకే కాకుండా, జాతీయ అభివృద్ధిలో కూడా భాగస్వామి అవుతుందని ఆయన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్, “మాకు భారత్ మొదటి ప్రాధాన్యత” అని నొక్కి చెప్పారు.
National Education Policy : జాతీయ విద్యా విధానంపై లోకేష్ మనుసులో మాట
టీడీపీ-ఎన్డీఏ మధ్య బంధం ఎన్నికల రాజకీయాలకు మాత్రమే పరిమితం కాదని, ఇది దేశ భవిష్యత్తు కోసం ఒక వ్యూహాత్మక భాగస్వామ్యమని లోకేష్ వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వానికి తాము బేషరతుగా మద్దతు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర పురోగతికి కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం పొందడం, జాతీయ స్థాయిలో నిర్ణయాలలో కీలక పాత్ర పోషించడం వంటివి ఈ బంధం వల్ల సాధ్యమవుతాయని ఆయన అన్నారు. ఈ నిబద్ధత ద్వారా, టీడీపీ భారతదేశ పురోగతికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సమగ్రమైన దృష్టితో కృషి చేస్తుందని ఆయన అన్నారు.
రాజకీయాల్లో తరచుగా మారే కూటములు, స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పడే బంధాలకు భిన్నంగా, టీడీపీ-ఎన్డీఏ బంధం దృఢమైన విలువలు మరియు లక్ష్యాల ఆధారంగా కొనసాగుతుందని లోకేష్ స్పష్టం చేశారు. ఈ బంధం ద్వారా, దేశం మరియు రాష్ట్రం రెండింటికీ ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన చెప్పారు. ఈ ప్రకటన ద్వారా లోకేష్, టీడీపీ భవిష్యత్తు రాజకీయాలపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.