Site icon HashtagU Telugu

Chandrababu : చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకెళ్లాలని టీడీపీ నిర్ణయం

Chandrababu

Chandrababu

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళ‌న నెల‌కొంది. ఈ రోజు చంద్ర‌బాబుని క‌లిసిన భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణి, లోకేష్‌లు ఆయ‌న్ని చూసి భావోద్వేగానికి గురైయ్యారు. చంద్ర‌బాబు ఆరోగ్యంపై వారు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ములాఖ‌త్ త‌రువాత లోకేష్ మీడియాతో మాట్లాడ‌కుండానే వెళ్లిపోయారు. చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌, ఆరోగ్యంపై మొద‌టి నుంచి టీడీపీ నేతలు, కుటుంబ‌స‌భ్యులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త కొద్ది రోజులుగా ఎండ‌తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో చంద్ర‌బాబు డీహైడ్రేష‌న్‌కు గురైయ్యారు. అదే స‌మయంలో ఆయ‌న‌కు స్కిన్ ఎల‌ర్జీ కూడా వ‌చ్చింది. మోహం, ఒంటిపై ద‌ద్దుర్లు వ‌చ్చాయి. చంద్ర‌బాబు చ‌ల్ల‌టి వాతావ‌ర‌ణంలో ఉండాల‌ని వైద్యులు నిన్న నివేదిక ఇచ్చారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో కుటుంబ‌స‌భ్యులు జైలు అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు ఆరోగ్య ప‌రిస్థితిపై కోర్టుని ఆశ్ర‌యించాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది. దీనిపై ఏసీబీ కోర్టులో చంద్ర‌బాబు త‌రుపున న్యాయ‌వాదులు పిటిష‌న్ వేయ‌నున్నారు. చంద్రబాబు మెడికల్ రిపోర్టును కోర్టుకు సమర్పించి మెరుగైన వైద్యం అందించాలని కోర్టుని చంద్ర‌బాబు న్యాయ‌వాదులు కోర‌నున్నారు.

Also Read:  CBN : `న్యాయానికి సంకెళ్లు’ పేరిట మరో విన్నూత నిరసనకు టీడీపీ పిలుపు