Site icon HashtagU Telugu

TDP-YCP War : బాబు ‘మహా దోపిడీ’ అయితే జగన్ ’99 మోసాలు’..పోటాపోటీ ట్వీట్స్

YCP- TDP

Tdp Ycp Vimarshalu

ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికార – ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ తగ్గడం లేదు. పోటీ పోటీ సభలకు , సిద్ధం అవుతున్నాయి. ఎవరికీ వారు తమదైన వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. అలాగే సోషల్ మీడియా లోను టీడిపి – వైసీపీ ఇరువురు ఒకరిపై ఒకరు పోటాపోటీగా విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి..చంద్రబాబు ఫై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పార్టీని మాఫియా ముఠాలా తయారు చేశారని దుయ్యబట్టారు. విజయవాడలో ‘మహా దోపిడీ’ పుస్తకాన్ని సజ్జల ఆవిష్కరించారు.సీనియర్ జర్నలిస్టు విజయబాబు ర‌చించిన `మహాదోపిడీ` పుస్తకావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు మోసాలు ప్రజలకు అర్థమయ్యాయి కాబట్టే 2019 టీడీపీని ఓడించారని గుర్తుచేశారు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు విప‌రీత‌మైన‌ దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారని, అధికారం కోసం పవన్‌, బీజేపీని వాడుకుంటున్నార‌ని చెప్పారు. చంద్ర‌బాబు దోపిడీ గురించి మ‌హా దోపిడీ పుస్త‌కంలో క్లియ‌ర్‌గా రాశార‌న్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు షర్మిల మాట్లాడే భాషను ప్రజలంతా గమనిస్తున్నారని, షర్మిల మాట్లాడే స్క్రిప్ట్‌ మొత్తం చంద్రబాబు వద్ద నుంచే వస్తోందన్నారు.

దేశానికి అవినీతిని పరిచయం చేసిందే చంద్రబాబు అని, రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు తన భార్యను కూడా వాడుకున్నారని కామెంట్స్‌ చేశారు. వైసీపీ కామెంట్స్ ఇలా ఉంటె.. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 99 మోసాలు చేశారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. ఈ మేరకు ఓ వీడియోను Xలో పోస్టు చేశారు. ‘మద్య నిషేధం, ప్రత్యేక హోదా, 45 ఏళ్లకే పెన్షన్, 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, వారంలో సీపీఎస్ రద్దు, రైతులకు ఉచితంగా బోర్లు, డ్వాక్రా రుణమాఫీ’ తదితర హామీలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఇలా ఇరు పార్టీలు నువ్వు మోసం చేశావంటే..నువ్వు మోసం చేసావు అంటూ ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు.

Read Also : Janasena Jung Siren Song : దద్దరిల్లుతున్న ‘జనసేన జంగ్ సైరన్’ ..