Site icon HashtagU Telugu

TDP vs YSRCP : టీడీపీ – వైసీపీ మధ్య ‘డంకీ’ వార్

Dunki Poster War

Dunki Poster War

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో రాష్ట్రంలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ రోజు రోజుకు ఎక్కవుతుంది. గతంలో సభలు , సమావేశాల్లో ఇరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకునేవారు..కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ..సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు , ప్రతికౌంటర్ల దగ్గరి నుండి పోస్టర్ల వార్ వరకు వచ్చింది. తాజాగా బాలీవుడ్ హీరో షారుఖ్ నటించిన డంకీ చిత్రాన్ని బేస్ చేసుకొని ఇరువురు ఒకరి ఫై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు.

టీడీపీ ముందుగా డంకీ పోస్టర్‌ను వైసీపీ నేతల ముఖాలతో మార్ఫింగ్‌ చేసి ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేసింది. ‘2024 ఎన్నికల ఫలితాలకు ముందే సైకో వైకాపా బ్యాచ్ అంతా విదేశాలకు పారిపోవడానికి లగేజీ సర్దుకుంటున్నారు’ అని పోస్టర్ కు క్యాప్షన్‌గా గా పెట్టి పోస్ట్ చేసింది. ఈ పోస్టర్‌లో JUMPI-AFTER 2024 Elections అని టైటిల్‌ను యాడ్ చేసింది టీడీపీ. ఈ పోస్టర్‌పై సీఎం జగన్‌, మంత్రి రోజా, మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ముఖాలను చేర్చింది. ఈ పోస్టర్ ఫై వైసీపీ కౌంటర్ పోస్టర్ పోస్ట్ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

టీడీపీ నేతల ముఖాలతో పోస్టర్‌ను డిజైన్ చేసి పోస్ట్ చేసింది. ‘పేదలకు జగనన్న ప్రభుత్వం చేస్తున్న మంచిని అడ్డుకుంటున్న ఈ పచ్చ హమాస్ బ్యాచ్ మన రాష్ట్రం నుంచి తరలిపోయే రోజు త్వరలోనే రానుంది’ అని పోస్టర్ కు క్యాప్షన్‌గా పెట్టింది. ఈ పోస్టర్‌లో ‘JUMPING JAPANG’ అని టైటిల్‌ను యాడ్ చేసింది వైసీపీ. ఈ పోస్టర్‌పై నారా లోకేష్, రామోజీ రావు, చంద్రబాబు, నాదెండ్ల మనోహర్‌, పవన్‌ కళ్యాణ్‌ ముఖాలను చేర్చింది. ప్రస్తుతం ఇరువురి పోస్టర్లతో డాంకీ చిత్రం పాపులర్ అవుతుంది. అసలు ఈ సినిమాకు ఈ పార్టీలకు సంబంధం ఏంటి అని అంత మాట్లాడుకోవడం మొదలుపెడుతున్నారు.

Read Also : Dawood Properties : దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. ఎన్ని ఆస్తులున్నాయంటే ?