జనసేన పొత్తు తో భయపడుతున్న టీడీపీ శ్రేణులు..ఎందుకంటే..!

పవన్ కళ్యాణ్ ఏమి ఆలోచించకుండా పొత్తు ప్రకటన చేసారని..మంచి రోజు, సుముహూర్తం, సమయం చూసుకుంటే బాగుండేదని అంటున్నారు. అమావాస్య రోజున ప్రకటన చేయడంతో ఇరు పార్టీలకు మంచి జరుగుతుందా..?

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan

Janasena TDP Alliance

టీడీపీ తో జనసేన పొత్తు (TDP Janasena Alliance) పెట్టుకుంటే భయపడడమే ఏంటి..? ఈ పొత్తు మంచిదే కదా..దీనికి భయపడడం ఎందుకు అనుకుంటున్నారా..? పొత్తు టీడీపీ పార్టీ కి , ఇటు జనసేన పార్టీ కి మంచిదే కాకపోతే..పొత్తు ప్రకటన చేసిన రోజును తలుచుకొని టీడీపీ శ్రేణులు ఖంగారుపడుతున్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ను CID అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏసీబీ కోర్ట్ లో హాజరు పరచడం..ఏసీబీ 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి జైలు స్నేహ బ్లాక్ లో ఉన్నారు. ఈ నెల 14వ తేదీన పవన్ కల్యాణ్ (Pawan Kalyan meets Chandrababu ) చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో టీడిపితో కలిసి బరిలోకి దిగబోతున్నామని..ఇప్పటినుండి టీడీపీ తో జనసేన పొత్తు అని ప్రకటించారు. ఈ పొత్తు ప్రకటనపై వేదిక..రోజు ..సమయం అనేది ఇప్పుడు టీడీపీ శ్రేణులను ఖంగారుకు , భయానికి గురి చేస్తుంది. జైలు లోపల బాబు ఉండగా ..జైలు బయట పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించాడు..ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయి.. అలాంటి కీలకమైన ఘట్టాన్ని.. జైలు వేదిక వద్ద ప్రకటించడంతో కొంత బెంగ పెట్టుకున్నారు. దాంతోపాటు మరో కీలక అంశం ఉంది. అదే అమావాస్య కావడం.. పోయి పోయి.. అమావాస్య (New Moon) రోజే పవన్ కల్యాణ్ ప్రకటన చేయాలా..? అని వారంతా వాపోతున్నారు. మరో రోజు.. పార్టీ ఆఫీసు వేదిక చేస్తే బాగుండేదని అభిప్రాయ పడుతున్నారు. ఆలా చేస్తే మాలో ఎలాంటి సందేహాలు , భయాలు ఉండేవి కావని..పోయి పోయి అమావాస్య రోజే ప్రకటన చేయడం మాకు బాదేస్తుందని వారంతా అంటున్నారు. ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు చాల కీలకం..ఇలాంటి కీలక వాటికీ అన్ని చూసుకొని తమ నిర్ణయాలను తెలుపుతారు.

Read Also : 5 Players Injured: ఒకే రోజు ఐదుగురు ఆటగాళ్లకు గాయాలు

అలాంటిది పవన్ కళ్యాణ్ ఏమి ఆలోచించకుండా పొత్తు ప్రకటన చేసారని..మంచి రోజు, సుముహూర్తం, సమయం చూసుకుంటే బాగుండేదని అంటున్నారు. అమావాస్య రోజున ప్రకటన చేయడంతో ఇరు పార్టీలకు మంచి జరుగుతుందా..? ఎన్నికల్లో ఆశించిన సీట్లలో గెలుస్తామా..? అనే ప్రశ్నలు వారి మదిలో కలుగుతున్నాయి. మరోపక్క వైసీపీ (YCP) సైతం అమావాస్య రోజున పొత్తు ప్రకటన చేయడం ఫై సెటైర్లు వేస్తుంది. మొత్తం మీద జనసేన పొత్తు ప్రకటన కొంతమంది టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది.

  Last Updated: 16 Sep 2023, 03:50 PM IST