చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) నేపథ్యంలో యావత్ రాష్ట్రం ఆగ్రహపు జ్వాలలతో ఉగిపోతుంటే..టీడీపీ కుటుంబ సభ్యుడైన జూ. ఎన్టీఆర్ (Jr NTR)ఇప్పటివరకు స్పందించకపోవడంఫై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసారని తెలిసి..సినీ, రాజకీయ , పలు రంగాల ప్రముఖులు.. పలు పార్టీల పెద్దలు చంద్రబాబుకు మద్దతు పలుకుతూ..అరెస్ట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఆయన అరెస్ట్ అక్రమమని ముక్త కంఠంతో ఖండిస్తుంటే..ఎన్టీఆర్ ఎందుకు నోరుమెదపడం లేదని పార్టీ కార్యకర్తలు , చంద్రబాబు , లోకేష్ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా లో అయితే ఏకంగా ఎన్టీఆర్ కు శ్రద్ధాంజలి ఘటిస్తూ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ పార్టీ గ్రూప్ లలో శ్రద్ధాంజలి (Shradhanjali) ఘటిస్తూ ఉన్న పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటె ఎన్టీఆర్ అభిమానులు మాత్రం టీడీపీ శ్రేణులు చేస్తున్న ప్రచారం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో తెలుసుకోకుండా ఇలా ప్రచారం చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కు ఎన్టీఆర్ మధ్య ఏంజరిగిందో తెలియకుండా ఇలా చేయొద్దంటూ వారు హెచ్చరిస్తున్నారు.
Read Also : Hyderabad: గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపనకు దరఖాస్తులు ఆహ్వానం
ఇదిలా ఉంటె స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case)లో అరెస్టై జైల్లో ఉన్న చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్‌పై పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున న్యాయవాదులు ఈ పిటిషన్ ఫైల్ చేశారు. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ కేసులో ఆయన్ని ఏ-1గా చూపించింది CID. ఇప్పటికే దీనిపై పీటీ వారెంట్ వేసిన సీఐడీ… చంద్రబాబును విచారించేందుకు అనుమతి తీసుకుంది. ఆయనకు స్కిల్స్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ వస్తే అమరావతి కేసులో అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.