Site icon HashtagU Telugu

I Am With CBN : మియాపూర్ టూ ఎల్బీన‌గ‌ర్‌.. నేడు చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా మెట్రో  రైలులో బ్లాక్ డ్రెస్‌ల‌తో ప్ర‌యాణం

CBN

CBN

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్ర‌మ అరెస్ట్‌పై టీడీపీ శ్రేణులు ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తున్నారు. హైద‌రాబాద్‌లో టీడీపీ శ్రేణులు, ఆయ‌న అభిమానులు వివిధ రూపాల్లో ఆందోళ‌న‌లు చేస్తున్నారు. ఐటీ ఉద్యోగులు చంద్ర‌బాబుకు మ‌ద్దతుగా నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. బ్లాక్ డే ప్రైడే పేరుతో నిన్న ఐటీ ఉద్యోగులు బ్లాక్ డ్రెస్‌ల‌తో ఆఫీసుల‌కు వెళ్లారు. తాజాగా టీడీపీ కార్య‌క‌ర్త‌లు, ఐటీ ఉద్యోగులు మెట్రోలో బ్లాక్ డ్రెస్‌ల‌తో ప్ర‌యాణించి చంద్ర‌బాబుకు సంఘీభావం తెల‌పాల‌ని నిర్ణ‌యించారు. ఈ రోజు(శ‌నివారం) ఉద‌యం 10.30 గంట‌ల నుంచి 11.30 గంట‌ల మ‌ధ్య మియాపూర్ టూ ఎల్బీన‌గ‌ర్ వ‌ర‌కు మెట్రోలో ప్ర‌యాణించాల‌ని పిలుపునిచ్చారు. ఐ యామ్ విత్ సీబీఎన్ ప్ల‌కార్డులు, బ్లాక్ టీ ష‌ర్ట్‌, ఎల్లో క‌ల‌ర్ క్యాప్ ధ‌రించి చంద్ర‌బాబుకు మ‌ద్దతు తెల‌పాల‌ని పిలుపునిచ్చారు. మిగ‌తా ప్ర‌యాణికుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని చంద్ర‌బాబు అభిమానులు కోరారు. చంద్ర‌బాబుపై స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాంలో అక్ర‌మంగా అరెస్ట్ చేశార‌న్న విష‌యాన్ని అంద‌రికి తెలియ‌జేసేలా కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. అప్ప‌టి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక‌.. ఇత‌ర దేశాల్లో ఉన్న టీడీపీ అభిమానులు, చంద్ర‌బాబు అభిమానులు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ఆందోళ‌న‌లు చేస్తున్నారు. ఐటీ ఉద్యోగులు వినూత్నంగా నిర‌స‌న‌లు చేప‌ట్టి చంద్ర‌బాబుకు మ‌ద్దతుగా నిలుస్తున్నారు.

Also Read:  TDP : తెలంగాణలో టీడీపీ రాజకీయ వ్యూహం అదేనా?