TDP Warning to YCP : ఇది నీ పాలనా కాదు ..ప్రజా పాలన – వైసీపీ కి టీడీపీ హెచ్చరిక

నా ప్యాలెస్ ముందు పేదలు ఉండకూడదు.. నా ప్యాలెస్ ముందు మీడియా రాకూడదు అంటే కుదరదమ్మా

  • Written By:
  • Publish Date - June 17, 2024 / 02:09 PM IST

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం..వచ్చి రాగానే పలు చోట్ల ట్రాఫిక్ కష్టాలను తొలగించడం తో ప్రజలు సంతోషిస్తున్నారు. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ నివాసం ఉండే ప్యాలెస్ ఎదుట ఆంక్షలు తొలగిపోవడం తో నగరవాసులు హమ్మయ్య అనుకుంటున్నారు. గత ఐదేళ్లు గా జగన్..అదేదో తన సొంతమైనట్లు ప్రజలకు ఎలాంటి సంబంధమే లేనట్లు 4లేన్ల రహదారిని ప్రైవేటు రోడ్డుగా మార్చుకొని ప్రజలను ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు..కానీ ఇక ఆ ఇబ్బందులను కూటమి మోక్షం కలిగించింది. తాడేపల్లి ప్యాలెస్‌ ఎదుట ఇప్పటి వరకూ ఉన్న ఆంక్షలను ఎత్తేయడంతో.. స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుండి ఆ రోడ్ల ఫై ప్రజలు ప్రయాణం చేస్తూ హమ్మయ్య అనుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

జగన్ సీఎం అయ్యాక ఆయన ఇంటి పక్కన ఉండే పేదలను అక్కడ నుంచి ఖాళీ చేయించిన పోలీసులు రహదారిని పూర్తిగా దిగ్బంధించారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. గతంలో ఫొటోలు, గుర్తింపు కార్డులు చూపించిన తర్వాతే జనాన్ని రోడ్డుపైకి పోలీసులు అనుమతించారు. ఉన్నతాధికారులు సైతం ఫొటోలు, గుర్తింపు కార్డులు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడచిన ఐదేళ్లుగా ఈ రహదారిని సీఎం క్యాంపు కార్యాలయం కోసం మాత్రమే వినియోగించారు. ఇతరులెవరికీ ప్రవేశం లేకుండా నిషేధించారు. జగన్‌ సీన్ పదవి పోగానే, క్యాంపు కార్యాలయాన్ని వైసీపీ రాష్ట్ర కార్యాలయంగా మార్చేశారు. అయినాకూడా ఆ మార్గంలోకి ఎవరినీ అనుమతించకవడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన కూటమి సర్కార్..ఈరోజు అక్కడ ఆంక్షలన్నీ ఎత్తేవేసి అందరికి ప్రవేశం కలిపించింది. అంతే కాదు వైసీపీ కి చిన్నపాటి వార్నింగ్ కూడా ఈ సందర్బంగా టీడీపీ ఇచ్చింది. నా ప్యాలెస్ ముందు పేదలు ఉండకూడదు.. నా ప్యాలెస్ ముందు మీడియా రాకూడదు అంటే కుదరదమ్మా.. ఇప్పుడున్నది నీ లాగా నియంత పాలన కాదు, ప్రజా పాలన.. అది ప్రజల రోడ్డు.. ప్రజాధనంతో వేసిన రోడ్డు.. మీడియా వస్తుంది, ప్రజలు వస్తారు, త్వరలో సిఐడి కూడా వస్తుంది.

అయినా 175 మంది ఎమ్మెల్యేల్లో, నువ్వూ ఒకడివి.. ఎందుకు అంత ఎక్కువగా ఊహించుకుంటావ్ ? ప్రతిపక్ష నేతగా కూడా పనికి రావని ఏపి ప్రజలు తిరస్కరించారు. నిన్ను గెలిపించింది పులివెందుల ప్రజలు, తాడేపల్లిలో ఏమి పని నీకు ? పులివెందుల ప్రజలకు సేవ చేయి వెళ్లి.. అక్కడ కూడా ప్యాలెస్ ఉందిగా, వెళ్ళు..అంటూ ట్విట్టర్ (X) లో పోస్ట్ చేసింది.

Read Also : Prajadarbar : నారా లోకేష్ చేపట్టిన ‘ప్రజాదర్బార్’ కు విశేష స్పందన