TDP : హిందూపురం మున్సిపాలిటీని అధికార కూటమి పార్టీ టీడీపీ కైవసం చేసుకుంది. బాలయ్య కంచుకోట అయిన హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా రమేష్ ఎన్నికయ్యారు. రమేష్‌కు అనుకూలంగా 23 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి లక్ష్మీకి అనుకూలంగా 14 ఓట్లు వచ్చాయి. దీంతో మున్సిపల్ చైర్మన్‌గా రమేశ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రమేశ్‌తో మున్సిపల్ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రమేష్‌ను దగ్గరుండి ఎమ్మెల్యే బాలకృష్ణ సీట్‌లో కూర్చోబెట్టారు. ఆరో వార్డు కౌన్సిలర్, టీడీపీ నేత సురేష్ ఛైర్మన్‌గా ఎన్నిక కావడంతో కూటమిలో జోష్ నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించగానే జై బాలయ్య అంటూ కూటమి శ్రేణులు నినాదాలు చేశాయి.
అయితే కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. పార్టీ మారిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటు జై బాలయ్య అంటూ టీడీపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. కాగా, గతంలో టీడీపీలో చేరి తర్వాత జగన్ సమక్షంలో నలుగురు కౌన్సిలర్లు వైసీపీలో చేరారు. వారు కూడా వైసీపీకి మద్దతుగా ఓటేయలేదు. హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఒక్క సారిగా కూడా ఎమ్మెల్యే స్థానంలో ఓడిపోలేదు. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో.. వైసీపీ లెక్కలేనన్ని అరాచకాలు చేసి.. మున్సిపల్ స్థానాల్లో ఆరు కౌన్సిలర్ సీట్లకే టీడీపీని పరిమితం చేసింది. కానీ అధికారం పోయాక ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్, ఏలూరు కార్పొరేషన్‌లలో డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనుండగా, నందిగామ మున్సిపాలిటీ, హిందూపురం మున్సిపాలిటీ, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ల ఎన్నికలు జరగుతున్నాయి. అదే విధంగా బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో వైస్ చైర్‌పర్సన్ల కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు.
Read Also: Shocking Incident : ఘోరం.. తండ్రి డెడ్‌బాడీని రెండు ముక్కలు చేయమని..