Site icon HashtagU Telugu

TDP Twitter Hacked : టీడీపీ ట్విట్ట‌ర్ ఖాతా హ్యాక్‌

Tdp Twitter Hack

Tdp Twitter Hack

తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్న వారికి హఠాత్తుగా ఆ ఖాతా కనిపించడం మానేసింది. ఏం జరిగింది? ఆ పార్టీ అభిమానులు త‌ర‌చి చూడ‌గా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు. పేరు మార్చేశారు. ఆర్టిస్టులనని చెప్పి బయో కూడా మార్చేసుకున్నారు. టైలర్ హెబ్స్ అనే ఆర్టిస్టు తన పోస్టుల్ని అందులో పోస్ట్ చేశారు.

తెలుగుదేశం పార్టీ అఫీషియట్ ట్విట్టర్ హ్యాండిల్‌కు @jaitdp పేరుతో ఖాతా ఉంది. హఠాత్తుగా టైలర్ హెబ్స్ అనే వ్యక్తి పేరు ప్రత్యక్షమయింది. అతను వరుసగా టీట్టీలు, రీట్వీట్లు చేసుకుంటూ పోయారు. ఇవేమీ అసభ్యకరంగా లేవు. తాను ఆర్టిస్టులనని బయోలో ప్రకటించుకున్న టైలర్ హ‌బ్స్ , అన్నీ ఆర్టుల్ల్నే పోస్ట్ చేశాడు. ఒంటి గంట వరకూ తెలుగుదేశం ట్విట్టర్ ఖాతాలో ప్రభుత్వం శ‌నివారం ప్రారంభించిన కల్యాణమస్తు పథకంపై ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఖాతా టైలర్ హెబ్స్ చేతికి వెల్లింది. ఆయన ప్రతి నాలుగైదు నిమిషాలకు ఓ ట్వీట్ చేస్తున్నారు. టైలర్ హబ్స్ తన వర్జినల్ ట్వీట్స్‌ను రీట్వీట్ చేస్తూ రీచ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

గతంలోనూ ఓ సారి తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. రెండు రోజుల పాటు శ్రమించి ఖాతాను మళ్లీ పునరుద్ధరించుకున్నారు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి ఎదురైంది. ట్విట్టర్ ఖాతా నిర్వహణ నాసిరకంగా ఉందని, సులువుగా హ్యాక్ చేసేలా ఉండటంతో హ్యాకర్లు టార్గెట్ చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ట్విట్టర్ హ్యాండిల్‌ను మళ్లీ సాధారణ స్థితికి తెచ్చేందుకు టీడీపీ సోషల్ మీడియా ఖాతాలు చూసే నిపుణులు ప్రయత్నిస్తున్నారు.

Exit mobile version