TDP Twist : ముగ్గురి ముచ్చ‌ట‌! విజ‌య‌వాడ ఎంపీగా బాల‌య్య‌?

ఎప్పుడూ లేని విధంగా(TDP Twist) ఈసారి చంద్ర‌బాబు రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారా? మంగ‌ళ‌గిరి నుంచి లోకేష్ త‌ప్పుకుంటున్నారా?

  • Written By:
  • Publish Date - June 15, 2023 / 02:49 PM IST

ఎప్పుడూ లేని విధంగా(TDP Twist) ఈసారి చంద్ర‌బాబు రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారా? మంగ‌ళ‌గిరి నుంచి లోకేష్ త‌ప్పుకుంటున్నారా? బాల‌క్రిష్ణ విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేయ‌బోతున్నారా? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఇప్పుడు టీడీపీలో వినిపిస్తున్నాయి. ఇదంతా వైసీపీ సోష‌ల్ మీడియా మైండ్ గేమ్ గా కొంద‌రు కొట్టేస్తున్నారు. మారిన రాజ‌కీయ ఈక్వేష‌న్ల దృష్ట్యా చంద్ర‌బాబు రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారనే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ మీద ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు (TDP Twist)

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ యూపీలో పోటీచేసి అక్క‌డ పార్టీకి రికార్డ్ విజ‌యాన్ని అందించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మిళ‌నాడు రాష్ట్రం నుంచి పోటీ చేసి ద‌క్షిణ భార‌త‌దేశంపై బీజేపీ ప‌ట్టుకోసం ప్లాన్ చేస్తోంది. ఇదే త‌ర‌హాలో ఏపీలోని ప్రాంతీయ విద్వేషాల‌ను చ‌ల్లార్చేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోస్తా ఆంధ్రాలోని ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. ప్ర‌త్యేకించి మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేయ‌డం ద్వారా రాజ‌ధాని నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాల‌ని పార్టీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. అంటే, కుప్పంతో పాటు మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసే అంశంపై పార్టీలోని అంత‌ర్గ‌త వ‌ర్గాలు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.

బాల‌క్రిష్ణ‌ను విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేయించాల‌ని టీడీపీలోని

ఇక విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని ఇటీవ‌ల టీడీపీ మీద ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌స్తుతం 20 మండుతోంద‌ని, అది 100 శాతానికి వెళితే ప్ర‌త్యామ్నాయం దిశ‌గా ఆలోచిస్తాన‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే విజ‌యవాడ కేంద్రంగా చేసుకుని టీడీపీ గ్రూప్ విభేదాలు తారాస్థాయికి చేరాయ‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే. అక్క‌డి నేత‌లు బొండా ఉమ‌, బుద్దా వెంక‌న్న‌, దేవినేని ఉమ త‌దిత‌రులంటే కేశినేనికి ప‌డ‌దు. వాళ్ల‌తో విభేదిస్తూ ఇటీవ‌ల వైసీపీ ఎమ్మెల్యేలు కృష్ణ‌ప్ర‌సాద్, నందిగామ ఎమ్మెల‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారు. అవ‌స‌ర‌మైతే, స్వంతంత్ర్య అభ్య‌ర్థిగా విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేస్తానంటూ ఇటీవ‌ల‌ ప్ర‌క‌టించారు. అంటే, టీడీపీకి గుడ్ చెప్పే ప్ర‌య‌త్నం ఆయ‌న చేస్తున్నారు. అందుకే, ప్ర‌త్యామ్నాయంగా బాల‌క్రిష్ణ‌ను విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేయించాల‌ని టీడీపీలోని(TDP Twist) చంద్ర‌బాబు కోట‌రీ ప్లాన్ చేస్తుంద‌ని వినికిడి.

హిందూపురం నుంచి లోకేష్ ను పోటీ చేయించాల‌ని

ప్ర‌స్తుతం హిందూపురం  ఎమ్మెల్యేగా బాల‌క్రిష్ణ ఉన్నారు. ఆయ‌న అక్క‌డ నుంచి వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తున్నారు. అయితే, ఈసారి ఆయ‌న‌తో క‌లిసి మునుప‌టిలా పనిచేయ‌లేక‌పోతున్నామ‌న్న స్థానిక లీడ‌ర్లు సంకేతం అధిష్టానంకు అందించిన‌ట్టు తెలుస్తోంది. అందుకే,హిందూపురం నుంచి లోకేష్ ను పోటీ చేయించాల‌ని టీడీపీ (TDP Twist) ఎత్తుగ‌డ వేస్తుంద‌ని స‌మాచారం. అదే జ‌రిగితే, బాల‌య్య విజ‌య‌వాడ ఎంపీగా రావ‌డం త‌థ్య‌మ‌ని వినిపిస్తోంది. దీంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ గ్రూప్ ల‌కు చెక్ ప‌డే ఛాన్స్ ఉంది. అంతేకాదు, గుడివాడ‌, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యేలు కొడాలి, వ‌ల్ల‌భ‌నేని వంశీల‌ను ఓడించ‌డం తేలిక అవుతుంద‌ని అంచ‌నా. ఎంపీగా బాల‌య్య విజ‌య‌వాడ నుంచి గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌కంటూ స‌ర్వేలు తేల్చాయ‌ట‌. లేదంటే, మ‌ళ్లీ హిందూపురం బాల‌య్య‌ కావాలంటే ఉత్త‌రాంధ్ర‌లోని ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోకేష్ ను పోటీ చేయించాల‌ని భావిస్తున్న‌ట్టు టీడీపీ లోని ఒక వ‌ర్గం చ‌ర్చించుకుంటోన్న అంశం.

రెండు చోట్ల చంద్ర‌బాబు పోటీ అనేది వైసీపీ చేస్తోన్న దుష్ఫ్ర‌చారం(TDP Twist)

ఒకానొక స‌మ‌యంలో విజ‌య‌వాడ ఎంపీగా భువ‌నేశ్వ‌రి ని రంగంలోకి దింపాల‌ని కూడా టీడీపీ వ‌ర్గాల్లో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జరిగింది. ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా వైసీపీలో బ‌ల‌మైన లీడ‌ర్లు ఉన్నారు. వాళ్ల‌ను ఎదుర్కొవాలంటే నంద‌మూరి కుటుంబం నుంచి ఎవ‌రో ఒక‌రు విజ‌య‌వాడ కేంద్రంగా ఉండాల‌ని టీడీపీ(TDP Twist) అధిష్టానం భావిస్తుంద‌ని వినికిడి. అందుకే, బాల‌య్య విజ‌య‌వాడ నుంచి పోటీ చేయ‌డానికి అంగీక‌రిస్తే గ్రూప్ లన్నీ పోతాయ‌ని పార్టీ పెద్ద‌ల అభిప్రాయం. అంతేకాదు, వైసీపీలోకి కేశినేని నాని వెళితే అప్పుడు ఈక్వేష‌న్స్ పూర్తిగా మారే ఛాన్స్ ఉంది. అందుకే, ముందుగా బాల‌య్య‌ను విజ‌య‌వాడ‌లో సెట్ చేయాల‌ని త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.

Also Read : CBN-Jagan : చంద్ర‌బాబుపై జ‌గ‌న్ మాన‌సిక దాడి

రెండు చోట్ల చంద్ర‌బాబు పోటీ చేస్తే, దాన్ని వైసీపీ అనుకూలంగా మ‌ర్చుకుంటోంద‌న్న భావ‌న కూడా టీడీపీలో ఉంది. ఎప్ప‌టి మాదిరిగా కంచుకోట‌గా ఉన్న కుప్పం నుంచి మాత్ర‌మే చంద్ర‌బాబు ఎన్నిక‌ల బ‌రిలో ఉంటార‌ని టీడీపీ కీల‌క లీడ‌ర్లు చెబుతున్నారు. రెండు చోట్ల చంద్ర‌బాబు పోటీ అనేది వైసీపీ చేస్తోన్న దుష్ఫ్ర‌చారంగా కొట్టిపారేస్తున్నారు. కానీ, ప్రాంతాల స‌మ‌తుల్య‌త, స‌ఖ్య‌త‌కు సంకేతం ఇచ్చేలా రెండు చోట్ల పోటీకి దిగుతార‌న్న ప్ర‌చారాన్ని పూర్తిగా కొట్టిపారేయ‌లేమంటూ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. మొత్తం మీద చంద్ర‌బాబు, బాల‌య్య‌, లోకేష్ పోటీ చేసే స్థానాల‌పై మునుపెన్న‌డూ లేని విధంగా ఈసారి స‌రికొత్త చ‌ర్చ‌కు తెర‌లేచింది.

Also Read: CBN Politics : మ‌ళ్లీ పాత క‌థ‌! పరాయి వాళ్ల‌కు రెడ్ కార్పెట్!