TDP Toppers : టీడీపీలోకి చంద్ర‌బాబు పాత కోట‌రీ? బీజేపీ, టీడీపీ పొత్తు లేన‌ట్టే!

మార్పును ముందుగా గ్ర‌హించిన వాళ్లు నేత‌లు టీడీపీ వీడిన వాళ్ల (TDP Toppers)

  • Written By:
  • Updated On - January 23, 2023 / 04:57 PM IST

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒక‌లా ఉండ‌వు. బండ్లు ఓడ‌లు, ఓడ‌లు బండ్లు అయిన‌ట్టు మారిపోతుంటాయి. ఆ మార్పును ముందుగా గ్ర‌హించిన వాళ్లు నేత‌లు అవుతారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ముందు వ‌రుస‌లో ఉంటారు. అందుకే, తెలుగుదేశం పార్టీని వీడిన వాళ్లంద‌రూ (TDP Toppers) తిరిగి సొంత‌గూటికి చేర‌డానికి రంగం సిద్దం చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది. అధికారంలో(Power) ఉన్న‌ప్పుడు ఫ్రంట్ లైన్ లో ఉన్న సీఎం ర‌మేష్‌, సుజ‌నా చౌద‌రి, మాజీ మంత్రులు ఆదినారాయ‌ణ‌, నారాయ‌ర‌ణ త‌దిత‌రులు టీడీపీ వైపు చూస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

తెలుగుదేశం పార్టీని వీడిన వాళ్లంద‌రూ(TDP Toppers) 

తెలుగుదేశం పార్టీని రాజ్య‌స‌భ వేదిక‌గా బీజేపీలో విలీనం చేసిన లీడ‌ర్లు సుజ‌నా, ర‌మేష్‌, టీజీ, గ‌రిక‌పాటి మోహ‌న‌రావు త‌దిత‌రులు (TDP Toppers) ఉన్నారు. ఎన్నిక‌ల నాటికి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వ‌స్తార‌ని అప్ప‌టి నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, బీజేపీ, టీడీపీ పొత్తుకు వాళ్లు ఢిల్లీ కేంద్రంగా ఎప్ప‌టిక‌ప్పుడు చ‌క్రం తిప్పుతున్నారు. హోం మంత్రి అమిత్ షా ను సానుకూలంగా మ‌లచ‌గ‌లిగారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఆయ‌న వైపు నుంచి పాజిటివ్ సంకేతాలు ఉన్న‌ట్టు ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మాత్రం అయిష్టంగా ఉన్నార‌ని తెలుస్తోంది.

Also Read : TDP Ganta : తెలుగుదేశం పార్టీలో `గంటా` లొల్లి, పోరాట‌యోధుల ప‌రాక్!

ఒక వేళ టీడీపీ, బీజేపీ మ‌ధ్య పొత్తు లేక‌పోతే, తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్లిన బ్యాచ్ మొత్తం తిరిగి సొంత‌గూటికి చేరుకోవ‌డానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఆ జాబితాలో క‌డ‌ప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి ముందు వ‌రుస‌లో ఉన్నారు. ఆయ‌న త‌ర‌హాలోనే సుజ‌నా చౌద‌రి, రమేష్ లు కూడా సొంత‌గూటికి చేరుకుని చ‌క్రం తిప్పాల‌ని చూస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ప‌లు స‌ర్వేలు ఏపీలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి (Power) రాబోతుంద‌ని అంచ‌నాలు ఉన్నాయి. అందుకే, ఇటీవ‌ల ర‌హ‌స్యంగా ఉన్న‌తాధికారులు చంద్ర‌బాబును క‌లుసుకుంటున్నారు. రాబోవు రోజుల్లో ఫోక‌ల్ పోస్టుల కోసం ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించారు.

వైసీపీలోని క‌నీసం 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు టీడీపీతో ట‌చ్

స‌ర్వేలు, క్షేత్ర‌స్థాయిలోని సొంత క్యాడ‌ర్ ఇస్తోన్న ఫీడ్ బ్యాక్ మేర‌కు వైసీపీలోని క‌నీసం 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు టీడీపీతో ట‌చ్ లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. వాళ్ల‌ను తొల‌గించ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నార‌ని స‌మాచారం. అందుకే, దీపం ఉండ‌గానే ఇళ్లు చ‌క్క‌బెట్టుకున్న చందంగా టీడీపీలో క‌ర్చీఫ్ వేసి పెడుతున్నారు. వైసీపీ లో టిక్కెట్ పొంద‌లేని వాళ్లు టీడీపీలో ఛాన్స్ కోసం చూస్తున్నారు. అక్క‌డ కూడా అవ‌కాశంలేక‌పోతే, జ‌న‌సేన నుంచి పోటీచేయ‌డానికి స్కెచ్ వేసుకుంటున్నారు. ఇక బీజేపీ ఏపీలో ప‌నిచేస్తోన్న ఇత‌ర పార్టీల లీడ‌ర్లు తెలుగుదేశం అవ‌కాశం ఇస్తే దూక‌డానికి సిద్దంగా ఉన్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. కానీ, ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జిలు ఉన్నారు. వాళ్ల‌ను కాద‌ని ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని ప్ర‌స్తుతం చంద్ర‌బాబు చెబుతున్న‌ప్ప‌టికీ అవ‌కాశం కోసం పైర‌వీలు చేస్తోన్న వైసీపీ ఎమ్మెల్మేలు లేక‌పోలేదు.

Also Read : Janasena-TDP : వారాహి, యువ‌గ‌ళం `సుప్రీం` షో, జీవో నెంబ‌ర్ 1 ట్విస్ట్

ఇలా ప‌లు ర‌కాలు తెలుగుదేశం పార్టీకి వ‌స్తోన్న సానుకూల అంశాల‌ను గ‌మ‌నిస్తోన్న పూర్వ‌పు చంద్ర‌బాబు కోట‌రీ తిరిగి
సొంత‌గూటికి రావాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఒక వేళ వాళ్లు మ‌ళ్లీ ఎంట్రీ ఇస్తే, గ‌తంలో మాదిరిగా పార్టీ వాళ్ల చేతుల్లోకి వెళ్లే అవ‌కాశం లేక‌పోలేదు. అందుకే, మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు లాంటి వాళ్లు పార్టీ క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు నిల‌బ‌డిన లీడ‌ర్ల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని వాయిస్ పెంచుతున్నారు. అందుకు భిన్నంగా ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న పూర్వ‌పు చంద్ర‌బాబు కోట‌రీ మ‌ళ్లీ చ‌క్రం తిప్ప‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. బీజేపీతో పొత్తు క‌ద‌ర‌క‌పోతే టీడీపీలోకి నేరుగా వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఒక వేళ పొత్తు కుదిరితే, బీజేపీలో ఉంటూనే టీడీపీలో చ‌క్రం తిప్ప‌డానికి స్కెచ్ వేసుకున్నార‌ని పొలిటిక‌ల్ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.