Site icon HashtagU Telugu

TDP : పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ ర‌వికి ప్రాణ‌హాని.. సెక్యూరిటీ తొలిగించ‌డంపై అచ్చెన్నాయుడు ఆగ్ర‌హం

Btech Ravi Arrested

Btech Ravi Arrested

టీడీపీ నేత బీటెక్ రవికి సెక్యురిటీ తొలగించడంపై డీజీపీకి టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తయిందనే నెపంతో రవికి సెక్యురిటీ తొలగించడంపై ఆయ‌న అభ్యంతరం వ్య‌క్తం చేశారు. బీటెక్ రవికి ప్రాణహాని ఉందని.. 2006లో రవి మామ ఎం. రామచంద్రారెడ్డి, కజిన్ పి.రామచంద్రారెడ్డిలను అతి దారుణంగా హత్య చేశారని ఆయ‌న గుర్తు చేశారు. అప్పటి నుంచి బీటెక్ రవికి నాటి ప్రభుత్వం 1+1 సెక్యురిటీ కల్పించిందన్నారు. ఎమ్మెల్సీ పదవి చేపట్టిన నాటి నుంచి సెక్యురిటీని 2+2 కు పెంచారని.. బీటెక్ రవికి తన రాజకీయ ప్రత్యర్ధులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రాణహాని ఉందని లేఖ‌లో పేర్కొన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల కోసం అర్ధంలేని కారణాలతో బీటెక్ రవికి సెక్యురిటీ తొలగించిందన్నారు. 2023 మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలోను బీటెక్ రవి వాహన శ్రేణిపై దాడి జరిగిందని.. ఆ దాడి నుంచి రవి త్రుటిలో తప్పించుకున్నారని తెలిపారు. కడపలో ఉన్న రాజకీయ పరిణామాలు దృష్ట్యా బీటెక్ రవిని భౌతికంగా లేకుండా చేయాలని ప్రత్యర్ధులు వ్యూహాలు పన్నుతున్నార‌ని అచ్చెన్నాయుడు ఆరోపించారు. బీటెక్ రవికి జరిగరానిది ఏదైనా జరిగితే అందుకు ప్రభుత్వందే బాధ్యత అని తెలిపారు. ఈ నేపధ్యంలో బీటెక్ రవికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా సెక్యురిటీ పునరుద్దరించాల‌ని డీజీపీని ఆయ‌న కోరారు.

Also Read:  CBN : వైఎస్ వివేకా హత్య హాలీవుడ్ ను మించిన స్టోరీ : టీడీపీ అధినేత చంద్ర‌బాబు