Site icon HashtagU Telugu

TDP : డీజీపీకి లేఖ‌.. ట్విట్ట‌ర్‌లో పోస్టులు కాదు మీరే..? చంద్ర‌బాబుపై టీడీపీ సోష‌ల్ మీడియా..

Tdp Mahanadu

Tdp Mahanadu

ఏపీ టీడీపీలో క్రింది స్థాయి క్యాడ‌ర్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉంది. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్ల‌లో టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై కేసులు న‌మోదు అవుతున్నాయి. మాజీ మంత్రుల ద‌గ్గ‌ర నుంచి మండ‌ల స్థాయి నాయ‌కుల వ‌ర‌కు కేసులు కొన‌సాగుతున్నాయి. అయితే అరెస్ట్ చేసిన స‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు, నారా లోకేష్‌లు ట్విట్ట‌ర్‌లో ఖండిస్తూ పోస్టులు పెడుతున్నార‌నే త‌ప్ప వాటిని సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. ఇటు ప్ర‌త్య‌ర్థుల చేతిలో హ‌త్య‌కు గురైన వారిని ప‌రామ‌ర్శించిన స‌మ‌యంలోనూ అధినేత మాట‌లు కోట‌లు దాటుతున్నాయి త‌ప్ప ఆచ‌ర‌ణ‌కు నోచుకోవ‌డంలేద‌ని క్యాడ‌ర్‌లో వినిపిస్తుంది. తాజాగా టీడీపీ మీడియా కోఆర్డినేట‌ర్ దార‌ప‌నేని న‌రేంద్ర‌ని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విష‌యంలో కూడా అధినేత చంద్ర‌బాబు ట్విట్ట‌ర్‌లో ఖండించి.. డీజీపీకి లేఖ రాశారు. అయితే దీనిపై టీడీపీలో భిన్న‌స్వ‌రాలు వినిపిస్తున్నాయి. అరెస్టులు చేస్తే డీజీపీకి లేఖ‌, ట్విట్ట‌ర్‌లో పోస్టులు చేయ‌డం కాదు..మీరే స్వ‌యంగా సీఐడీ కార్యాల‌యానికి రండి అంటూ టీడీపీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌లు చంద్ర‌బాబుకి లేఖ రాశారు.

గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ గారికి సోషల్ మీడియా టీడీపీ కార్యకర్త వ్రాసుకున్న విన్నపము :

అయ్యా :-
డీజీపీ గారికి లేఖ…చంద్రబాబు
ట్విట్టర్ వేదికగా పోస్ట్…లోకేష్

అయ్యా లేఖలు, ట్విట్టర్ ఖాతాలో పోస్టులు కాదు మీరు స్వయంగా డిజిపి, సిఐడి కార్యాలయనికి వస్తే రాష్ట్రం మొత్తం కార్యకర్తలను అరెస్ట్ చెయ్యాలంటే భయం రావాలి. మన రాష్ట్ర టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తేనే ఏం చెయ్యలేని వారిలో టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పదవులు పొందిన నేతలు ఉన్నారు. నిన్న రాత్రి పూట రాష్ట్ర టీడీపి మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర గుంటూరు సిఐడి అరెస్టయ్యారా.. రేపు ఏవన్నీ అరెస్ట్ చేస్తారో అని కార్య‌క‌ర్త‌లు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. పార్టీలో తిరిగే స్వచ్ఛంద కార్యకర్తల కుటుంబ సభ్యుల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. డీజీపీ గారికి లేఖ… ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తే కార్యకర్తలల్లో నిరుత్సాహం కలిగిస్తుంది మరి కొంతమంది నేతలు వారి వారి ఫొటోలు, వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చేతులు దులుపుకొన్నారు. అరెస్టులకు పుల్‌స్టాప్‌….?ఎప్పుడు… టీడీపీ కార్యకర్తలల్లో భయం వస్తే బుతుల్లో ఒక్కరు కూడా ఉండరని భజన చేసే వాళ్ళను దూరంగా పెట్టి కార్యకర్తల నుoచి ఫీడ్ బ్యాక్ తీసుకొని వెళ్లాలని టీడీపీ కార్యకర్తలు కోరుతున్నారు.. అంటూ అధినేత చంద్ర‌బాబుకి సోష‌ల్ మీడియా టీడీపీ కార్య‌క‌ర్త‌లు లేఖ రాశారు.