TDP – Social Equations : టీడీపీ సగానికిపైగా అసెంబ్లీ సీట్లు మూడు వర్గాలకే! 

TDP - Social Equations : తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు 4  జాబితాల్లో 144 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

  • Written By:
  • Updated On - March 31, 2024 / 08:33 AM IST

TDP – Social Equations : తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు 4  జాబితాల్లో 144 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టే టీడీపీకి వచ్చే లోక్‌సభ స్థానాలు డిసైడ్ అవుతాయి. ప్రత్యేకించి అసెంబ్లీ సీట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలు(TDP – Social Equations) కీలక పాత్ర పోషిస్తాయి. ఈవిషయంలో టీడీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగింది ? ఏయే సామాజిక వర్గాలకు ఎన్ని సీట్లను కేటాయించింది ? అనే వివరాలపై ఓ పరిశీలన ..

We’re now on WhatsApp. Click to Join

సగానికిపైగా సీట్లు మూడు వర్గాలకే.. 

గత ఎన్నికలలాగే ఈసారి కూడా బీసీలు, కమ్మ, రెడ్డి వర్గానికి టీడీపీ పెద్దపీట వేసింది. ఇప్పటివరకు కేటాయించిన 144 అసెంబ్లీ టికెట్లలో అత్యధికంగా 34 బీసీలకు, 32 కమ్మ వర్గం వారికి, 27 రెడ్డి వర్గం వారికి దక్కాయి. ఇక ఎస్సీ వర్గం నేతలకు  25, కాపులకు 10,  క్షత్రియ వర్గం నేతలకు 05, ఎస్టీలకు 04, ముస్లిం మైనార్టీలకు 3,  వైశ్యులకు 02, వెలమలకు 01, బలిజలకు 01 స్థానం టీడీపీ నుంచి లభించాయి.

Also Read :Vivekam : ‘వివేకం’.. యూట్యూబ్‌లో సంచలనంగా వైఎస్‌ వివేకా బయోపిక్‌

వర్గాల వారీగా టికెట్లు పొందిన కీలక నేతలు

ఇక టీడీపీ నుంచి అసెంబ్లీ టికెట్లు పొందిన కీలక బీసీ నేతల జాబితాలో అచ్చెన్నాయుడు(టెక్కలి), కళా వెంకట్రావు (చీపురుపల్లి), కే పార్దసారధి (నూజివీడు),  పితాని సత్యనారాయణ(ఆచంట), యనమల దివ్య(తుని),  కొల్లు రవీంద్ర (బందరు),  చదలవాడ అరవిందబాబు (నరసరావుపేట) తదితరులు ఉన్నారు.

  • ముస్లిం మైనారిటీ నేతలలో  ఫరూక్‌‌కు నంద్యాల టికెట్ దక్కింది. షాజహాన్ బాషాకు మదనపల్లె, మహ్మద్ నజీర్‌కు గుంటూరు ఈస్ట్ టికెట్‌ను చంద్రబాబు  కేటాయించారు.
  • టీడీపీ టికెట్స్ పొందిన కీలక ఎస్సీ నేతల్లో కొండ్రు మురళీ (రాజాం), నక్కా ఆనందబాబు(వేమూరు) ఉన్నారు.
  • ఎస్టీ వర్గానికి చెందిన తొయ్యక జగదీష్‌(కురుపాం),  గుమ్మడి సంధ్యారాణి(సాలూరు), కిల్లి వెంకట రమేష్ నాయుడు(పాడేరు), మిరియాల శిరీష(రంపచోడవరం)లకు టికెట్స్ దక్కాయి.
  • కాపు  వర్గానికి చెందిన నిమ్మకాయల రాజప్ప(పెద్దాపురం), బోండా ఉమ(విజయవాడ-సి), కన్నా లక్ష్మీనారాయణ(సత్తెనపల్లి), గంటా శ్రీనివాసరావు(భీమిలి)లకు టీడీపీ టికెట్స్ దక్కాయి.
  • రెడ్డి వర్గానికి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (సర్వేపల్లి), కోటంరెడ్డి (నెల్లూరు రూరల్‌), బీటెక్‌ రవి(పులివెందుల), అఖిల ప్రియ(ఆళ్లగడ్డ), గౌరు చరితా రెడ్డి (పాణ్యం),  కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి(డోన్‌), నల్లారి కిషోర్‌ కుమార్ రెడ్డి(పీలేరు), అమర్నాధ్ రెడ్డి (పలమనేరు), ఆనం(ఆత్మకూరు)లకు టికెట్స్ వచ్చాయి.
  • కమ్మ వర్గానికి చెందిన గద్దె రామ్మోహన్‌ (విజయవాడ -ఈ), నారా లోకేష్‌(మంగళగిరి), ధూళిపాళ నరేంద్ర (పొన్నూరు), పత్తిపాటి పుల్లారావు(చిలకలూరిపేట), జీవీ ఆంజనేయులు(వినుకొండ), ఏలూరి సాంబశివరావు(పర్చూరు), గొట్టిపాటి రవి కుమార్‌ (అద్దంకి), పయ్యావుల కేశవ్‌ (ఉరవకొండ), పరిటాల సునీత(రాప్తాడు), బాలకృష్ణ (హిందూపురం), చంద్రబాబు(కుప్పం), చింతమనేని(దెెందులూరు)లకు టీడీపీ టికెట్స్ దక్కాయి.
  • వైశ్య వర్గానికి చెందిన శ్రీరాం తాతయ్య(జగ్గయ్యపేట), టీజీ భరత్‌ (కర్నూలు)లకు టికెట్స్ వచ్చాయి.
  • వెలమ వర్గానికి బేబీ నయనకు బొబ్బిలి టికెట్ ఇచ్చారు.
  • క్షత్రియ వర్గానికి చెందిన అదితి అశోక్‌ గజపతి రాజు(విజయనగరం), దాట్ల సుబ్బరాజు(ముమ్మిడి వరం), మంతెన రామరాజు(ఉండి), వేగేశ్న నరేంద్ర వర్మ(బాపట్ల), కెఎస్ ఎన్ రాజు(చోడవరం)లకు టీడీపీ టికెట్స్ వచ్చాయి.

Also Read : Red Carpets Ban : పాకిస్తాన్‌లో రెడ్ కార్పెట్‌పై బ్యాన్.. ఎందుకో తెలుసా ?