NTR Health University : ఎన్టీఆర్ పేరు మార్పును వ‌దిలేసిన టీడీపీ

హెల్త్ యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొల‌గింపు అంశాన్ని అర్థాంత‌రంగా టీడీపీ వ‌దిలేసింది.

  • Written By:
  • Publish Date - September 30, 2022 / 03:53 PM IST

హెల్త్ యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొల‌గింపు అంశాన్ని అర్థాంత‌రంగా టీడీపీ వ‌దిలేసింది. తొలి రెండు రోజులు ఎన్టీఆర్ పేరు మార్పుపై నానా హంగామా చేసింది. అంతే వేగంగా ఎన్టీఆర్ బ‌తికున్న రోజుల్లో చంద్ర‌బాబు చేసిన అవ‌మానాన్ని వైసీపీ ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లింది. దీంతో ష‌డ‌న్ గా ఆ ఇష్యూని టీడీపీ వ‌దిలేసింది.

ఎన్టీయార్ పేరును యూనివర్సిటీకి తీసేసిన రోజు చాలా భీకరమైన శపథం చేశారు. ఎన్టీయార్ పేరును మళ్ళీ యూనివర్సిటీకి పెట్టేంతవరకు ఎంతదాకైనా పోరాటాలు చేస్తామని గంభీరంగా ప్రకటించారు. కానీ, నాలుగురోజులు అయ్యేసరికి ఇష్యూని చంద్రబాబు వదిలేశారు. రెండోరోజే చంద్రబాబు ప్లానంతా రివర్సుకొట్టింది. ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడవటం, పార్టీని లాగేసుకోవటం, అధ్యక్షుడిగా దింపేయటం చివరకు మరణానికి కారణమవ్వటం అంతా జనాల్లో చర్చ మొదలైంది. వారసుల అండతో చంద్రబాబు+దగ్గుబాటి కలిసి ఎన్టీయార్ కు చేసిన ద్రోహాన్ని మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలు జనాలకు చక్కగా వివరించి చెప్పారు.

ఎన్టీయార్ కు వారసులు+తోడల్లుళ్ళు కలిసి చేసిన అవమానం, ద్రోహం ముందు యూనివర్సిటికీ పేరు తీసేయటం ఎంత? అనే చర్చ జనాల్లో మొదలైంది. ఇలాంటి చ‌ర్చ జ‌ర‌గాల‌నే జగన్మోహన్ రెడ్డి కోరుకుని సక్సెస్ అయ్యారు. దసరానవరాత్రుల సందర్భంగా విజయవాడ నగరంలోని చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లేమిటంటే 1995లో ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి సీఎం అయిన తర్వత చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో చంద్రబాబు ఏమిచెప్పారంటే ‘వుయ్ డోంట్ నీడ్ ఎన్టీయార్’ అని. అదిపుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. దీంతో ఇష్యూను వదిలేసి టీడీపీ యూ టర్న్ తీసుకుంది.