Site icon HashtagU Telugu

TDP : అసెంబ్లీ ప్రాంగ‌ణంలో మీడియా సాక్షిగా స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌పై ప్ర‌జెంటేష‌న్ ఇచ్చిన ప‌య్యావుల కేశ‌వ్‌

TDP

TDP

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ ఏర్పాటుపై టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్ మీడియా సాక్షిగా ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. గత 20 రోజలనుంచీ వైసీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించి అవాస్తవాలు… అసత్యాలు… అర్థసత్యాలను ప్రజలకు చెప్పడానికి నానా తంటాలు పడుతోందని ఆయ‌న తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు.. దాని ఆవశ్యకత గురించి తెలుసుకునే ముందు గతంలోకి వెళ్లాల్సిన అవసరముందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరిం గ్ కళాశాలలు అనేవి అంత తేలిగ్గా అందుబాటులోకి రానివిగా కనిపించేవని.. ఇంజనీరింగ్ చదవాలంటే కర్నాటక, గుల్బర్గా, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లాలనుకునే రోజుల్లో ఆనాడు అప్పుడప్పుడే కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం రాష్ట్ర యువత అందిపుచ్చుకోవాలనే సత్సంకల్పంతో ఒకే ఒక్కపాలసీ నిర్ణయంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 350కి పైగా ఇంజనీరింగ్ కళాశాలలు రాష్ట్రానికి అందించారని గ‌ర్తు చేశారు.

ఇంజనీరింగ్ కళాశాల.. దానికి సంబంధించిన విద్య నేడు పెద్ద విశేషంగా కనిపించకపో వచ్చు గానీ, ఆనాడు అది చాలా విలువైనదన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుచేసినందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు రాజీనామాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకం టే ఆనాడు వారు ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరించారని తెలిపాఉ. కానీ చంద్రబాబునాయుడు ఒక గొప్ప పాలసీ ఫ్రేమ్ వర్క్ తయారుచేసి, ఆ పాలసీ నిబంధనల ప్రకారం ఎవరు వచ్చినా అర్హులేనని స్పష్టం చేశారు. నేడు చంద్రబాబునాయుడి అరెస్ట్ అక్రమమని నిరసిస్తూ రోడ్లపైకి వస్తున్న ఐటీ, ఇతర రంగాల ఉద్యోగులంతా ఆనాడు చంద్రబాబు తీసుకొచ్చిన పాలసీ డెసిషన్ వల్ల ఉన్నతస్థానాల్లో నిలిచినవారేన‌ని ప‌య్యావుల తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పై మేం చర్చకు పట్టుబడితే మాకు సినిమా చూపిస్తామని మంత్రులు అంటున్నార‌ని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు.. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్ధతుగా ఆయన తప్పుచేయరని నినదిస్తూ ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి త్రీడీ లో సినిమా చూపిస్తున్నారన్నారు. చంద్రబాబు తీసుకున్న ఒక్కపాలసీ నిర్ణయం ఎంత మార్పు తీసుకొచ్చిందో చెప్పడానికి ఇదే నిదర్శనమ‌న్నారు. ఈ తరహా విధానం కంటే మిన్నగా మరేదైనా గొప్పగా చేయాలని విభజనానంతర ఏపీలోని యువతను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు 2014లో ఆలోచించారని గుర్తు చేశారు.

భావితరాలకు ఏది కావాలో దూరదృష్టితో ఆలోచించిన మేథావి చంద్రబాబు, దాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖులు వైసీపీ ఎమ్మెల్యేల‌ని అన్నారు. చంద్రబాబు నవ్యాంధ్ర యువత గురించి ఆలోచిస్తున్న సమయంలోనే సిమెన్స్ సంస్థ వారు వచ్చి గుజరాత్ లో తాము అమలుచేస్తున్న ప్రాజెక్ట్ గురించి చెప్పారని.. చంద్రబా బులాంటి వ్యక్తి తమను గుర్తిస్తే, తమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని భావించి సిమెన్స్ సంస్థ వారే ఆయన వెంటపడ్డారని గుర్తు చేశారు. వారి ప్రజంటేషన్ చూశాకే ఇక్కడి అధికారు ల్ని నాటి టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ అమలు తీరుతెన్నుల పరిశీలనకు గుజరాత్ పంపింద‌ని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అనేది రాష్ట్రంలోని యువతకు కేవలం ప్లంబింగ్ … ఎలక్ట్రీషియన్… కార్పెంటర్ వంటి వృత్తులు నేర్పడానికి పెట్టింది కాదని..సాంకేతిక పరిజ్ఞానంలో రాబోయే నెక్ట్స్ వేవ్ ను మన పిల్లలకు అందించాలనే ఆశయంతో మొదలు పెట్టిందన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం చంద్ర‌బాబుపై కావాల‌ని అక్ర‌మ కేసులు పెట్టి వేధిస్తున్నార‌ని ప‌య్య‌వుల మండిప‌డ్డారు.