TDP : చంద్రబాబుపై అత్యాచారం కేసు తప్ప అన్ని సెక్షన్లూ పెట్టారు – కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని కేంద్రమాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్

  • Written By:
  • Publish Date - October 13, 2023 / 02:31 PM IST

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని కేంద్రమాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. రాష్ట్రంలో సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్నాక ప్రజల హక్కులు హరిస్తున్నారని మండిపడ్డారు. రాజ‌మండ్రిలో నారా భువనేశ్వరిని అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో వచ్చి పరామర్శించారు. చంద్రబాబును అరెస్టు చేసిన రోజున ఆయనపై రేప్ కేసు తప్ప అన్ని సెక్షన్లూ చూపించారన్నారు. అక్రమంగా జైల్లో పెట్టిన వ్యక్తికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వరా? అని ప్ర‌శ్నించారు. చంద్రబాబు పట్ల ఈ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని.. ఇది సైకో మ‌న‌స్త‌త్వానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. చంద్రబాబు నాయుడు ఎందులోనూ దోషి కాదని.. ధర్మం ప్రకారం చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే నాయకుడ‌ని ఆయ‌న తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రజాస్వామ్య కృషికి పాడుపడే వ్యక్తికి ప్రజాస్వామ్య వ్యతిరేకులు అడ్డు తగులుతున్నారని.. వైసీపీ మంత్రులు చట్టవిరుద్ధంగా రోడ్లపై చొక్కాలిప్పుతున్నారు.. డ్యాన్సలు వేసినా వారిపై కేసులుండవని తెలిపారు. 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ పై వచ్చి చట్టాన్ని ఎలా చుట్టంగా మార్చుకోవాలో నేర్పిస్తున్నారరి… ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదన్నారు. గతంలో అచ్చెన్నాయుడును అరెస్టు చేయించి కరోనా తగిలించి, ఫైల్స్ ఆపరేషన్ కూడా చేయించుకోనీలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు ఆఖరి దశకు వచ్చాయని.. ఇప్పుడైనా కనీసం రాగధ్వేషాలకు అతీతంగా పని చేయాలని సూచించారు. టీడీపీని ఎన్టీఆర్ తెలుగువారి కోసం స్థాపించారు. తెలుగు ప్రజల కోసం టీడీపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని అశోక్‌గ‌జ‌ప‌తి రాజు తెలిపారు.

Also Read:  Chandrababu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగన్ దే బాధ్యత – మాజీ మంత్రి య‌న‌మ‌ల‌