టీడీపీ రెండో జాబితా (TDP Second List ) వచ్చేసింది. 34 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను టీడీపీ అధిష్టానం విడుదల చేసింది. గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, మాడుగులలో పైలా ప్రసాద్, చోడవరం- KSN రాజు, ప్రత్తిపాడు – సత్యప్రభ, రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామచంద్రాపురంలో వాసంశెట్టి సుభాష్ లు టికెట్ దక్కించుకున్న వారిలో ఉన్నారు. అయితే ఈ జాబితాలో కేవలం ముగ్గురు సీనియర్ నేతలకు మాత్రమే టికెట్లు ఇచ్చి మిగతా సీనియర్ నేతలకు షాక్ ఇచ్చారు చంద్రబాబు (Chandrababu).
We’re now on WhatsApp. Click to Join.
సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, కళావెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా, కేఎస్ జవహర్, బుద్ధా వెంకన్న పేర్లు ప్రకటించలేదు. రెండో జాబితాల్లోనూ తమకు కచ్చితంగా టికెట్ దక్కుతుందని సీనియర్లు భావించారు. అయితే, వారికి సెకండ్ లిస్టులోనూ నిరాశే ఎదురైంది. సీనియర్ నాయకులు, మాజీ మంత్రులకు సెకండ్ లిస్టులోనూ చోటు దక్కలేదు. కనీసం మూడో జాబితాలో అయినా తమకు టికెట్ వచ్చే అవకాశం ఉందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చోడవరంలో బత్తుల తాతాయ్య కు , మాడుగులలో గవిరెడ్డి రామానాయుడుకు, పివిజి కుమార్ లకు నిరాశే ఎదురైంది. వైసీపీకి రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంకు సత్యవేడు టికెట్ ఇచ్చింది.. ఇక, విజయవాడ వెస్ట్ లో జలీల్ ఖాన్ కు టికెట్ దక్కలేదు. మరి వీరిని ఏమి చేయబోతున్నారో చూడాలి.
ఇదిలా ఉంటె విశాఖ సౌత్ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్లీ టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీ ప్రకటించిన రెండో జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాజ్జీ విశాఖ సౌత్ లేదా మాడుగుల టికెట్ను ఆశించారు. కానీ ఆయనకు ఎక్కడా అవకాశం దక్కలేదు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం.
Read Also : Vikram Thangalan : చియాన్ ఫ్యాన్స్ కి మళ్లీ నిరాశే.. తంగలాన్ రిలీజ్ పై డైరెక్టర్ ఏమన్నాడు అంటే..!