ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీడీపీ రెండో జాబితా వచ్చేసింది. 34 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను టీడీపీ అధిష్టానం విడుదల చేసింది. గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, మాడుగులలో పైలా ప్రసాద్, చోడవరం- KSN రాజు, ప్రత్తిపాడు – సత్యప్రభ, రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామచంద్రాపురంలో వాసంశెట్టి సుభాష్ లు టికెట్ దక్కించుకున్న వారిలో ఉన్నారు.
ఇప్పటికే 94 మందితో కూడిన జాబితాను విడుదల చేయగా ఈరోజు రెండో జాబితా విడుదల చేసింది. పొత్తులో భాగంగా 31అసెంబ్లీ స్థానాలను జనసేన, బీజేపీలకు కేటాయించడం జరిగింది. అలాగే 8 పార్లమెంట్ స్థానాల్లో జనసేన, బీజేపీలు పోటీ చేయాలని నిర్ణయించినందున 17మంది పార్లమెంట్ క్షణాల్లో టీడీపీ పోటీ చేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
రెండో జాబితా వివరాలు ఇలా ఉన్నాయి.