TDP Scheme : మ‌గువ‌కు `మ‌హాశ‌క్తి` చంద్ర‌బాబు

TDP Scheme : తెలుగుదేశం పార్టీ మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తోంది. ఆస్తిలో హ‌క్కు క‌ల్పించ‌డం ద్వారా ఎన్టీఆర్ చిర‌స్థాయిగా నిలిచిపోయారు.

  • Written By:
  • Publish Date - July 14, 2023 / 02:05 PM IST

TDP Scheme : తెలుగుదేశం పార్టీ మ‌హిళ‌ల‌కు తొలి నుంచి ప్రాధాన్యం ఇస్తోంది. ఆస్తిలో హ‌క్కు క‌ల్పించ‌డం ద్వారా స్వ‌ర్గీయ ఎన్టీఆర్ చిర‌స్థాయిగా మ‌హిళ మ‌న‌సులో నిలిచిపోయారు. ఆ త‌రువాత చంద్ర‌బాబు హ‌యాంలో స్థానిక సంస్థ‌ల్లో 8శాతం రిజ‌ర్వేష‌న్ మ‌హిళ‌ల‌కు క‌ల్పించారు. మ‌హిళ‌ల‌ను ఒక‌చోట‌కు చేర్చ‌డం కోసం డ్వాక్రా సంఘాల‌ను పెట్టారు. ఆర్థికాభివృద్ధి దిశ‌గా మ‌హిళ‌ల‌ను ముందుకు న‌డిపించారు. డ్వాక్రా సంఘాల‌ను పెట్ట‌డానికి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించిన తొలి రోజుల్లో విప‌క్షాలు చేసిన విమర్శ‌లు కోకొల్ల‌లు. కాపురాల‌ను కూల్చ‌డానికి డ్వాక్రా గ్రూపుల‌ను పెడుతున్నార‌ని కొంద‌రు కాంగ్రెస్ లీడ‌ర్లు అప్ప‌ట్లో వ్యాఖ్యానించారు. అంతేకాదు, వాళ్ల‌కు సెల్ ఫోన్లు ఇవ్వ‌డం ద్వారా పురుషుల‌పై తిర‌గ‌బ‌డేలా చేస్తున్నార‌ని విమ‌ర్శించిన వాళ్లు లేక‌పోలేదు. డ్వాక్రా సంఘాల్లో చేరిన మ‌హిళ‌ల‌ను చిన్న‌చూపు చూసిన విప‌క్ష లీడ‌ర్లు అప్ప‌ట్లో అనేకులు. మ‌హిళ కోసం యూనివ‌ర్సిటీని పెట్టిన టీడీపీ మ‌హాశ‌క్తి (TDP Scheme) ప‌థ‌కాన్ని తాజాగా ప్ర‌క‌టించింది.

తెలుగుదేశం పార్టీ మ‌హిళ‌ల‌కు తొలి నుంచి ప్రాధాన్యం (TDP Scheme )

ఎవ‌రేమ‌న్నా, చంద్ర‌బాబు మాత్రం మ‌హిళ‌లు ఆర్థిక శ‌క్తిగా (TDP Scheme)మారాల‌ని డ్వాక్రా సంఘాల‌ను బ‌లోపేతం చేయ‌గ‌లిగారు. ప్ర‌భుత్వం నుంచి ఆర్థిక స‌హాయం అందచేస్తూ, డ్వాక్రా గ్రూపుల‌కు రాయితీలు ప్ర‌క‌టించారు. ఫ‌లితంగా ఉన్న‌త వ‌ర్గాలు కూడా ఇప్పుడు స్వ‌యం సహాయ బృందాలు చేరుతున్నారు. బ్యాంకుల‌తో అనుసంధానం బృందాల‌కు ఏర్ప‌డింది. రుణాల‌ను తీసుకుంటున్నారు. డ్వాక్రా ఉత్ప‌త్తులు పెరిగాయి. వాళ్ల ఆర్థిక స్తోమ‌త పెర‌గ‌డంతో పాటు ఆత్మ‌విశ్వాసంతో ఉన్నారు. అవ‌స‌ర‌మైతే, కుటుంబాన్ని ఒంటరిగానైనా న‌డిపించ‌గ‌ల‌మ‌న్న ఆత్మ‌విశ్వాసం ఉండేలా చేయ‌గ‌లిగారు. ఇదంతా ఒక రోజులో అయిన ప్ర‌క్రియ కాదు. ఉమ్మ‌డి ఏపీలో చంద్ర‌బాబు తీసుకొచ్చిన అతిపెద్ద మ‌హిళా ఆర్థిక సంస్క‌ర‌ణ డ్వాక్రా గ్రూపుల‌ను ఏర్పాటు చేయ‌డం. ఇప్పుడు దాని ఫ‌లితాన్ని అనుభ‌విస్తోన్న మ‌హిళ‌లను ఇత‌ర పార్టీలు కూడా ప్రోత్స‌హించేలా చేయ‌గ‌లిగిన విజ‌న‌రీ చంద్ర‌బాబు.

మ‌హాశ‌క్తి ప‌థ‌కం గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి వ‌ర్క్ షాపు

సంస్క‌ర‌ణ‌లు ఎప్పుడూ విడ‌త‌వారీగా ఉంటాయి. వాటిని అమ‌లు చేయ‌డం ద్వారా వ‌చ్చే అంతిమ ఫ‌లితాన్ని విజ‌న‌రీ మాత్ర‌మే ముందుగా చూడ‌గ‌ల‌రు. ఎప్పుడో 20 ఏళ్ల క్రిత‌మే డ్వాక్రా సంఘాల ఎదుగుద‌ల‌ను ఊహించ‌గ‌లిగారు. అంద‌కే, వాళ్ల‌ను ప్రోత్స‌హిస్తూ వ‌చ్చారు. విద్యా రంగంలో 33శాతం మ‌హిళ‌ల‌కు క‌ల్పించారు. మూడో ద‌శ సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా స్వ‌యం స‌హాయ బృందాల‌కు `మ‌హా శ‌క్తి`(TDP Scheme) పేరుతో కొన్ని ప‌థ‌కాల‌ను అందించ‌డానికి చంద్ర‌బాబు ముందుకొచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌స్తే జిల్లా ప‌రిధిలో ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణం కల్పించారు. ఏడాదికి మూడు సిలెండ‌ర్ల‌ను ఉచితంగా ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

Also Read : CBN Vision 2024 : ఒకేసారి TDP అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌?

ఇంట్లో ఎంత మంది మ‌హిళ‌లు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌తి ఒక్క‌రికీ నెల‌కు 1500 ఇచ్చేలా చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం కింద ఏడాదికి 15వేలు చ‌దువుకునేలా పిల్ల‌ల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఇంటిలో ఎంత మంది పిల్ల‌లు ఉంటే అన్ని 15వేలు ఇస్తామ‌ని వెల్ల‌డించారు. మ‌హిళ‌ల‌ను ఆర్థికంగా బ‌లోపేతం చేయ‌డం ద్వారా ఆర్థిక శ‌క్తిగా మార్చాల‌ని చంద్ర‌బాబు సంక‌ల్పించారు. అందుకే, మ‌హాశ‌క్తి ప‌థ‌కం గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి వ‌ర్క్ షాపును విజ‌య‌వాడ‌లో చంద్ర‌బాబు ప్రారంభించారు. మారుమూల గ్రామాల వ‌ర‌కు మ‌హాశ‌క్తి  (TDP Scheme) గురించి తీసుకెళ్ల‌డానికి ప్ర‌త్యేక వాహ‌నాల ద్వారా ప్ర‌చారం మొద‌లు పెట్టారు. మ‌హిళ‌లు అంద‌రూ ఈ ప్ర‌చారానికి సార‌థులంటూ చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. మ‌హిళా సాధికారితకు చంద్ర‌బాబు త‌యారు చేసిన విజ‌న్ సంచ‌ల‌నంగా మారింది.

Also Read : CBN Fight : ఢిల్లీ వ‌ర‌కు చంద్ర‌బాబు పోరుబాట