Site icon HashtagU Telugu

Minister Roja : మంత్రి రోజా బెంజ్ కారు క‌థ‌, క‌ర‌ప్ష‌న్ క్వీన్లంటూ టీడీపీ సెటైర్లు

Roja Car

Roja Car

మంత్రిగా బాధ్య‌తలు స్వీక‌రించిన మూడో నెల‌కు రోజాకు బెంజ్ కారు వ‌చ్చేసింది. ఆ కారు ప్రారంభాన్ని సినిమా స్టైల్ లో చేసింది. ఆమె కుమారుడికి బ‌హుమ‌తిగా ఇచ్చిన‌ట్టు వీడియో ద్వారా అర్థం అవుతోంది. కొత్త బెంజ్ కారు సంబ‌రాల్ని త‌న‌దైన ఆర్భాటంతో రోజా చేయ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, ఆ ఆర్భాటాన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో ఎక్కించింది. అప్పుడే బాగా వెన‌కాశావంటూ సెటైర్లు వేస్తూ టీడీపీ ఎంట్రీ ఇచ్చింది.

ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత ఆర్కే రోజా తాజాగా రూ.1.50 కోట్ల‌తో బెంజ్ కారు కొనుగోలు చేసింది. కుమారుడు కౌశిక్ కోసం ఆ కారును కొన్నార‌ట‌. ఆ కారును కుమారుడితో క‌లిసి ఆవిష్క‌రించారు. కుమారుడిని ప‌క్క‌న కూతురు, భ‌ర్త‌ను వెన‌క సీట్ల‌లో కూర్చోబెట్టుకుని ఫ‌స్ట్ రైడ్‌కు వెళ్లారు. ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో రోజా పోస్ట్ చేసింది. ఈ వీడియోను విప‌క్ష టీడీపీ త‌న అధికారిక ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేస్తూ, దానిపై ఓ సెటైర్ సంధించింది.

“మంత్రి గారికి అపాయింట్మెంట్ లు బాగానే వస్తున్నట్టు ఉన్నాయి. బాగానే వెనకేసారు అంటూ రోజా వీడియోపై టీడీపీ కామెంట్ చేసింది. రోజా కొన్న జీఎల్ఎస్‌- 400డీ బెంజ్ కారు విలువ రూ.1.5 ల‌క్ష‌ల‌ని కూడా టీడీపీ నిర్థారించింది. జ‌గ‌న్ కేబినెట్‌లో రోజా, విడ‌ద‌ల ర‌జ‌నీల‌ను క‌ర‌ప్ష‌న్ క్వీన్లుగా పేర్కొంటూ ఓ లోగోను రోజా కారు వీడియోకు అతికించి వైర‌ల్ చేస్తున్నారు. ఇద్ద‌రు మ‌హిళా మంత్రులు అపాయింట్ మెంట్ కోసం వ‌స్తున్న వారి వ‌ద్ద రూ.50 వేల చొప్పున వ‌సూలు చేస్తున్నారంటూ టీడీపీ ఆరోప‌ణ‌లు గుప్పించింది.

మొత్తం మీద రోజా కొనుగోలు చేసిన కారు వ్య‌వ‌హారం ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపుతోంది. రాబోవు రోజుల్లో ఫైర్ బ్రాండ్ రోజా ఏం చేస్తుందో చూడాలి.