Site icon HashtagU Telugu

CM Jagan: పెరిగిన జగన్ బ్యాండేజ్ సైజ్..టీడీపీ సెటైర్లు

CM Jagan

CM Jagan

CM Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి ఘటన సంచలనంగా మారింది. ఒక సీఎంపై దాడి చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ స్పందించడంతో ఇష్యూ ప్రధాన వార్తగా మారిపోయింది. అయితే సీఎం జగన్ పై రాళ్లు రువ్విన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సిట్‌ బృందం ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. విజయవాడలోని అజిత్‌సింగ్‌ నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన ఐదుగురిలో ఒకరు మేమంతా సిద్దం బస్సుయాత్రలో ఆయనపై రాయి విసిరినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలు, అందుబాటులో ఉన్న ఇతర వీడియో ఫుటేజీల సహాయంతో నిందితులను సిట్ గుర్తించింది. సీఎంపై దాడికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడింది సిట్.

ఇదిలా ఉండగా జగన్ పై జరిగిన దాడి బూటకమని కొట్టి పారేస్తోంది టీడీపీ. జగన్ బ్యాండేజ్ సైజ్ రోజురోజుకి పెరిగిపోతుంది అంటూ టీడీపీ సెటైర్లు విసురుతుంది. తాజాగా ఓ టీడీపీ నేతా సింపతీ రెడ్డి అంటూ జగన్ బ్యాండేజ్ సైజ్ ఫోటో పోస్ట్ చేసి, రెండో రోజుకే బ్యాండేజ్ సైజ్ పెరిగిపోయింది అంటూ విమర్శించారు. ప్రస్తుతం దీనికి సంబందించిన మీమ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోకసభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో ఏకకాలంలో అసెంబ్లీ, మరియు లోకసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. టీడీపీ, జనసేన ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తుండాగా, వైసీపీ మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

Also Read: Hyderabad: 4 లక్షల మత్తు పదార్థాలు స్వాధీనం.. ఇద్దరు విద్యార్థులు అరెస్ట్