Attack On CM Jagan : ‘కోడి కత్తి కమలాసన్ ఈజ్ బ్యాక్!’ – టీడీపీ

ముమ్మాటి కి ఇది కూటమి శ్రేణుల పనే అని వైసీపీ శ్రేణులు చెపుతుంటే..టీడీపీ మాత్రం ‘కోడి కత్తి కమలాసన్ ఈజ్ బ్యాక్!’ ఖండిస్తోంది

Published By: HashtagU Telugu Desk
Stone Attack Jagan

Stone Attack Jagan

ఏపీ సీఎం జగన్ (CM Jagan) ఫై రాళ్లదాడి (Stone Attack) జరగడం..ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. ముమ్మాటి కి ఇది కూటమి (TDP) శ్రేణుల పనే అని వైసీపీ (YCP) శ్రేణులు చెపుతుంటే..టీడీపీ మాత్రం ‘కోడి కత్తి కమలాసన్ ఈజ్ బ్యాక్!’ ఖండిస్తోంది. గత ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా , బాబాయ్ హత్య తో జగన్ ఎన్ని రాజకీయాలు చేసాడో తెలియంది కాదు. శవరాజకీయాలు చేయడంలో జగన్ ను మించినవారు లేరు అంటూ సొంత చెల్లెలు షర్మిల ఓ పక్క , కూటమి పార్టీలు ఓ పక్క చెపుతూ వస్తున్నప్పటికీ..మళ్లీజగన్ వాటినే నమ్ముకున్నాడు. మరో నెల రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగన్ కొత్త నాటకానికి తెరదించారని టీడీపీ ఆరోపిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

గత ఎన్నికల్లో ఎలాగైతే సింపతీ నమ్ముకొని ఓట్లు వేయించుకున్నాడో..ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడని పక్కాగా తెలుస్తుందని అంటుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసిన కూటమి గాలే వీస్తుండడం..వైసీపీ ని నమ్ముకుంటే జైలు జీవితమే అని సొంత పార్టీ నేతలు వరుసపెట్టి రాజీనామాలు చేస్తుండడం..మరోపక్క సుప్రీం కోర్ట్ సైతం అక్రమ ఆస్తుల కేసులను బయటకు తీస్తుండడం తో జగన్ మరోసారి తనలోని కమల్ హాసన్ ను బయటకు తీసాడని టీడీపీ శ్రేణులు చెపుతున్నారు.

తాజాగా విజయవాడ లో జగన్ బస్సు యాత్ర చేస్తుండగా..ఎవరో ఆగంతకుడు జగన్ ఫై రాయి విసిరాడు. దీంతో జగన్ ఎడుమ కన్ను బొమ్మకు తగిలింది. ఈ దాడి తర్వాత వెంటనే డాక్టర్స్ జగన్ కు ప్రధమ చికిత్స అందించారు. ఆ తర్వాత తన యాత్రను కొనసాగించారు. ఈ రాయి దాడి ఫై టీడీపీ స్పందించింది. ‘కోడి కత్తి కమలాసన్ ఈజ్ బ్యాక్!’ అంటూ తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చింది. దెబ్బతగిలిందని నటించబోయే ముందు… కెమెరా ముందు నటించేటప్పుడు అంటూ రెండు ఫొటోలను చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. మరోపక్క ఈ దాడి చేసింది ముమ్మాటికీ టీడీపీ శ్రేణులే అని వైసీపీ అంటుంది.‘‘ మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ పచ్చమూకలు చేసిన పిరికిపంద చర్య. రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించండి. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారు’’ అని వ్యాఖ్యానించింది. మరి ఈ దాడి చేసిందో ఎవరో అతి త్వరలో తెలియనుంది.

Read Also : Kodali Nani : గుడివాడలో కొడాలికి భారీ షాక్..

  Last Updated: 13 Apr 2024, 10:59 PM IST