TDP Radio : మోడీ `మ‌న్ కీ బాత్` త‌ర‌హాలో రేడియో ద్వారా చంద్ర‌బాబు వాయిస్

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ `మ‌న్ కీ బాత్` త‌ర‌హాలో చంద్ర‌బాబు సోష‌ల్ మీడియా వేదిక‌గా రేడియో(TDP Radio)

  • Written By:
  • Publish Date - February 24, 2023 / 02:30 PM IST

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ `మ‌న్ కీ బాత్` త‌ర‌హా లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు సోష‌ల్ మీడియా వేదిక‌గా రేడియో(TDP Radio) కార్య‌క్ర‌మాన్ని రూప‌క‌ల్ప‌న చేస్తున్నారు. ఏదైనా మేజ‌ర్ సంఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే అందుకు సంబంధించిన వివ‌రాల‌ను చంద్ర‌బాబు(CBN) వాయిస్ ద్వారా ఆడియోను అంద‌రికీ పంపిస్తారు. త‌ద్వారా స‌మాచారం పూర్తిగా క్యాడ‌ర్ కు చేరుతుంద‌ని టీడీపీ భావిస్తోంది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాను బాగా ఉప‌యోగిస్తున్న టీడీపీ తాజాగా రేడియోను కూడా ప‌రిచ‌యం చేయ‌నుంది.

సోష‌ల్ మీడియా వేదిక‌గా చంద్ర‌బాబు రేడియో(TDP Radio)

గ‌న్నవరంలో వైసీపీ చేసిన దమనకాండ ను వివ‌రిస్తూ బ‌హిరంగ లేఖ ను చంద్ర‌బాబు(CBN) రాశారు. దాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేశారు. పార్టీ అధికార ప‌త్రిక చైత‌న్య‌ర‌థం ద్వారా కూడా క్యాడ‌ర్ వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. అయిన‌ప్ప‌టికీ ఇంకా కొంద‌రికి చేర‌లేదు. నిర‌క్ష్య‌రాస్యులు సోష‌ల్ మీడియాలోని న్యూస్ కు దూరంగా ఉంటారు. వాళ్ల కోసం వాయిస్ రూపంలో సమాచారాన్ని అంద‌చేయాల‌ని టీడీపీ భావించింది. అందుకే, రేడియో ప్రోగ్రామ్(TDP Radio) ను డిజైన్ చేసింది.

Also Read : CBN : గ‌న్న‌వ‌రం ఎపిసోడ్ పై చంద్ర‌బాబు క‌ల‌త‌! రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ‌!!

ఇక నుంచి టీడీపీ అధిప‌తి, ముఖ్య నాయకుల సందేశాలను వాయిస్ ఓవర్ రూపంలో సోషల్ మీడియాలో (TDP Radio) మ‌రింత చేరువ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాఉఉ. ఇదే కార్యక్రమాన్ని యువగళం పాదయాత్రలో సైతం అమలు చేయాల‌ని భావిస్తున్నారు. వినూత్నంగా చేస్తున్న ఈ కార్యక్రమం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తమ నాయకుడు సందేశాన్ని వినడానికి ప్రజలు ఆసక్తిగా వున్నారు.

సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆన్ లైన్ రేడియోల‌ను

సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆన్ లైన్ రేడియోల‌ను వింటున్నాం. ఎఫ్ ఎంలు ఇటీవ‌ల బాగా ప్రాచుర్యం పొందాయి. ప్ర‌త్యేకంగా టీడీపీ ఎఫ్ ఎం రేడియో మాదిరిగా ఒక ఫ్రీక్వెన్సీని తీసుకోవాల‌ని భావిస్తోంది. అయితే, కొన్ని ప్రాంతాల‌కు మాత్ర‌మే ఆ సిగ్న‌ల్స్ వెళ్లే అవ‌కాశం ఉంది. అందుకే, వెబ్ రేడియోల‌ను డిజైన్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్ల ద్వారా ఆ రేడియోను(TDP Radio) వినిపించ‌డానికి సాంకేతిక‌త‌ను ఉప‌యోగిస్తున్నారు.

ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకురావ‌డానికి రేడియోను(TDP Radio)

ప్ర‌స్తుతం 5జీ అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ ఆశించిన మేర‌కు నెట్ వ‌ర్క్ అన్నీ ప్రాంతాల్లో లేదు. ఒక వేళ ఉన్న‌ప్ప‌టికీ వీడియోలు ప్లే కావ‌డానికి డేటా ఎక్కువ అవ‌స‌రం. అందుకే, త‌క్కువ డేటా ఉన్న ఫోన్ల లోనూ ప్లే అయ్యేలా ఆడియోను పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక మీద ఉండే ప్ర‌ధాన ప్లాట్ ఫారంల‌న్నింటికీ ఆడియోల‌ను పంపాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది. ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకురావ‌డానికి రేడియోను(TDP Radio) సాధ‌నంగా ఉప‌యోగించుకోవాల‌ని భావిస్తోంది. స‌రికొత్త ప్ర‌యోగం టీడీపీ సోష‌ల్ మీడియాను మ‌రింత ప‌టిష్ట‌ప‌రుస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అంతేకాదు, ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువగా టీడీపీ వాయిస్ ను తీసుకెళ్ల‌డానికి అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. అందుకే, ఆ దిశ‌గా గ‌న్న‌వ‌రం ఎపిసోడ్ ను ఆడియో రూపంలో రేడియో ద్వారా విడుద‌ల చేశారు. రాబోవు రోజుల్లో సాంకేతిక లోపాల‌ను మ‌రింత స‌రిదిద్ద‌డం ద్వారా రేడియోను మ‌రింత చేరువ‌చేయ‌డానికి టీడీపీ(CBN) సాంకేతిక విభాగం ప‌నిచేస్తోంది.

Also Read : CBN-LN : తండ్రీ కొడుకుల హ‌వా!,యువ‌గ‌ళం, `ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి..`హోరు!