టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రస్తుతం ఫోకస్ అంత ఎన్నికలపైనే పెట్టారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బాబు..ఈసారి విజయం సాధించి జగన్ (Jagan) ఫై కసి తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఇందుకోసం గట్టి ప్లానే చేస్తున్నాడు. ఇప్పటికే జనసేన (Janasena) తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగాడు. అలాగే వైసీపీ నేతలకు టికెట్ ఆఫర్లు ప్రకటించి తమ పార్టీలోకి లాగేసుకుంటున్నారు. ఇదే తరుణంలో ఉచిత హామీలు ప్రకటించి ప్రజలను టీడీపీ వైపు తిప్పుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం ‘రా.. కదలిరా’ (RAA KADALI RAA) పేరుతో భారీ సభలు నిర్వహిస్తూ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. 12 రోజుల్లో మొత్తం 22 సభలు నిర్వహించాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా 25 లోక్‌సభ స్థానాల పరిధిలో ఒక్కొక్క చోట ఒక్కొక్క సభను టీడీపీ ఏర్పాటు చేస్తుంది. తొలి సభ ఈ నెల 5న ఒంగోలు లోక్‌సభ స్థానం పరిధిలోని కనిగిరిలో జరిగింది. ఇక, సంక్రాంతి వల్ల ఈ నెల 11 నుంచి 17 వరకు సభలకు విరామం ఇచ్చారు. అలాగే అయోధ్య రామాలయం వల్ల 21వ తేదీ నుంచి 23 వరకూ కూడా సభలకు గ్యాప్ ఇచ్చారు. ఇక, ఆ తరువాత అంతా యథావిధిగా కొనసాగుతుంది. ఈరోజు పీలేరు, అనంతపురం జిల్లా ఉరవకొండ (Uravakonda )లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే ‘రా కదలిరా’ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు.
మరికాసేపట్లో పీలేరుకు చేరుకొని అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం హెలికాప్టర్లో సాయంత్రం 4 గంటలకల్లా ఉరవకొండకు చేరుకుని అక్కడి సభలో పాల్గొంటారని వెల్లడించాయి. సాయంత్రం 4 గంటలకు ఉరవకొండ మండలంలోని లతవరం చేరుకోని.. అక్కడ సాయంత్రం 5:30 వరకూ చంద్రబాబు సభ నిర్వహిస్తారు. ఈ సభకు సంబంధించి టీడీపీ శ్రేణులు సర్వం సిద్ధం చేసింది. చంద్రబాబు ఉరవకొండకు చేరుకోగానే ఆయనకు పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలికేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Read Also : AP : టీడీపీ-జనసేన పొత్తు విచ్ఛిన్నం కోసం వైసీపీ గోతి కాడ నక్కలా ఎదురుచూస్తుంది – బొండా ఉమ